Hebah Patel: సక్సెస్ ఫార్ములాతో టాలీవుడ్ హీరోయిన్.. డిఫరెంట్ కాన్సెప్ట్‏తో వస్తున్న హెబ్బా పటేల్.. కొత్త సినిమా ప్రారంభం..

తెలుగు సినిమా ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు హెబ్బా పటేల్. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఈ అమ్మడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్త సినిమా స్టార్ట్ చేసింది.

Hebah Patel: సక్సెస్ ఫార్ములాతో టాలీవుడ్ హీరోయిన్.. డిఫరెంట్ కాన్సెప్ట్‏తో వస్తున్న హెబ్బా పటేల్.. కొత్త సినిమా ప్రారంభం..
Hebah Patel

Updated on: Mar 14, 2026 | 2:10 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. కానీ విభిన్న కంటెంట్ చిత్రాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం తన కొత్త సినిమాను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. అర్జున్ ఆర్ట్స్ సమర్పణలో చిత్రాలయ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీలక్ష్మీ.ఎం నిర్మాతగా ప్రొడక్షన్ నెంబర్ 3 రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకి ‘దర్జా’ ఫేమ్ మ్యాక్ (సలీం మాలిక్) దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఎమోషన్, కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ సినిమాని భారీ ఎత్తున రూపొందించబోతోన్నారు. ఈ మేరకు నటీనటులు, ఇతర సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాల్ని ప్రకటించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

‘దర్జా’ మూవీతో అందరినీ మెప్పించిన మ్యాక్ (సలీం మాలిక్) ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. ఆడియెన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా, డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునే దర్శకుడు మ్యాక్ (సలీం మాలిక్) ఈ సారి ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి మాటలు, పాటల్ని భాష్యశ్రీ అందించనున్నారు. కేవీఆర్ అడిషనల్ స్క్రీన్ ప్లేని రాశారు. ఎం. సమీర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చనున్నారు. విష్ణు పానికర్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా హెబ్బా పటేల్ నటించనున్నారు. మిగిలిన వివరాల్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనున్నారు.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

హెబ్బా పటేల్ విషయానికి వస్తే.. 2014లో తిరుమనం ఎనుం నిఖా సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ కన్నడలో వచ్చిన అధ్యక్ష సినిమా ముందుగా విడుదలైంది. అదే ఏడాది తెలుగులో అలా ఎలా ? సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇఛ్చింది. ఆ మరుసటి ఏడాది 2015లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఈ మూవీతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగులో ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, అలా నిన్ను చేరి, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు సరైన స్టార్ డమ్ రాలేదు.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us