రూ. 2 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్లు.. ఇప్పుడు తెలుగు ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ సినిమా!

ఇతర భాషల్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలను తెలుగులోకి తీసుకొచ్చేటప్పుడు సరైన సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఎంత మంచి కంటెంట్ ఉన్నా.. ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు. గతంలో చాలా సినిమాలు ఇలానే వచ్చి తెలుగులో బోల్తా పడ్డాయి.

రూ. 2 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్లు.. ఇప్పుడు తెలుగు ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ సినిమా!
Hanuman Ansh

Updated on: Nov 26, 2026 | 8:54 AM

భారతీయ సినీ చరిత్రలో కొన్ని సినిమాలు అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఈ ఏడాది విడుదలై అలాంటి అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో హనుమాన్ అన్ష్ కచ్చితంగా అగ్రస్థానంలో నిలుస్తుంది. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు లేకపోయినా.. కేవలం కంటెంట్ బలంతోనే ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేసింది. కేవలం రూ. 2 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైన తర్వాత బాక్సాఫీస్ లెక్కలను తలకిందులు చేసింది. ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తూ ఏకంగా రూ. 300 నుండి 400 కోట్ల వరకు వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

పెట్టిన పెట్టుబడికి వందల రెట్లు లాభాలను తెచ్చిపెట్టి, ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా రికార్డు సృష్టించింది.  థియేటర్లలో అఖండ విజయాన్ని సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా తెలుగు సినీ అభిమానుల కోసం ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు, అలాగే మరోసారి ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని ఇంట్లోనే కుటుంబంతో కలిసి చూడాలనుకునే తెలుగు ప్రేక్షకులకు ఇది నిజంగా పండగ లాంటి వార్తే. స్ట్రీమింగ్ తేదీ అలాగే  ప్లాట్‌ఫామ్ ఓటీటీలో సందడి చేయనుంది.  నవంబర్ 27 నుంచి సోనీ లివ్ ఓటీటీల్లోకి రానుందని ఇదివరకే ప్రకటించారు. అయితే ఇది హిందీ వెర్షన్ మాత్రమే కాగా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గుజరాతీ వెర్షన్లు.. ఈ  నవంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us