Tollywood: వెన్నెలమ్మ నవ్వులన్ని ఈ చిన్నారి చిరునవ్వులోనే.. ముద్దులొలుకుతున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి..

|

Dec 04, 2022 | 1:14 PM

తెలుగు చిత్రపరిశ్రమలో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా..

Tollywood: వెన్నెలమ్మ నవ్వులన్ని ఈ చిన్నారి చిరునవ్వులోనే.. ముద్దులొలుకుతున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us on

అందం, అభినయం ఆమె సొంతం. ఆమె రూపం సుమనోహార దివ్యరూపం. నెమలి కళ్లతో.. పెదాలపై చెరగని చిరునవ్వుతో నేలజారేనే జాబిలమ్మ అన్నట్టుగా కనిపిస్తుంది. జీవితంలో కష్టాలు ఎదురొచ్చినా.. విమర్శలు పలకరించినా చిరునవ్వుతోనే సమాధానం చెప్పేస్తారు. తెలుగు చిత్రపరిశ్రమలో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. నటన పరంగానూ ప్రశంసలు అందుకున్నారు. తెలుగు, హిందీ సినీ పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. నార్త్ అమ్మాయి తెలుగింటి కోడలయ్యారు.పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన ఆమె…ఇప్పడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్నారు. ఎవరో గుర్తుపట్టండి. ఈరోజు తన పుట్టినరోజు కూడా. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?..

ఆ బోసి నవ్వుల చిన్నారి హీరోయిన్ రేణు దేశాయ్. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఈ సినిమా సయమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత మళ్లీ పవన్ సరసన జానీ చిత్రంలో నటించి మెప్పించారు. చాలాకాలం ప్రేమలో ఉన్న వీరు 2009లో ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి అకీరా నందన్ బాబు, ఆద్య పాప ఉన్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ కళ్యాణ్ తో విడాకుల అనంతరం ప్రస్తుతం తన పిల్లలతో కలిసి సింగిల్‏గా ఉంటున్నారు రేణు దేశాయ్. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నా ఆమె.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. 18 ఏళ్ళ తర్వాత ఈమె స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హేమలత లవణం పాత్రలో నటిస్తున్నారు రేణు దేశాయ్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.