Guess The Actress: చారడేసి కళ్ల ఈ అమ్మాయి ఇప్పుడు ఫేమస్‌ నటి.. హోమ్లీ బ్యూటీగా క్రేజ్‌.. ఎవరో గుర్తుపట్టారా?

చారడేసి కళ్లతో చూపుతిప్పుకోనివ్వని ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? సినిమాలు బాగా చూసే వారు ఈ అమ్మాయిని సులభంగా గుర్తుపట్టవచ్చు. అంతలా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుందీ అందాల తార. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కెరీర్‌ కొనసాగించాలంటే గ్లామర్ ఒలికించాల్సిందే. అయితే ఈ బ్యూటీ రూటే సపరేటు. గ్లామర్‌ షోకు పూర్తి దూరం. పూర్తిగా హోమ్లీ ..

Guess The Actress: చారడేసి కళ్ల ఈ అమ్మాయి ఇప్పుడు ఫేమస్‌ నటి.. హోమ్లీ బ్యూటీగా క్రేజ్‌.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Actress

Updated on: Oct 12, 2023 | 9:11 AM

చారడేసి కళ్లతో చూపుతిప్పుకోనివ్వని ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? సినిమాలు బాగా చూసే వారు ఈ అమ్మాయిని సులభంగా గుర్తుపట్టవచ్చు. అంతలా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుందీ అందాల తార. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కెరీర్‌ కొనసాగించాలంటే గ్లామర్ ఒలికించాల్సిందే. అయితే ఈ బ్యూటీ రూటే సపరేటు. గ్లామర్‌ షోకు పూర్తి దూరం. పూర్తిగా హోమ్లీ యాక్ట్రెస్‌ ట్యాగ్‌ సొంతం చేసుకుంది. అచ్చ తెలుగు అమ్మాయిగా అభిమానుల్లో స్థానం సంపాదించుకుంది. గ్లామర్‌కు దూరంగా ఉన్నా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. మధ్యలో పెళ్లి చేసుకుని కాస్త సినిమాలకు గ్యాప్‌ ఇచ్చినా ఆడియెన్స్‌ మనసుల్లో ఆమె స్థానం మారలేదు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. అలాగే పలు టీవీ షోల్లో మెరుస్తోంది. మరి ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా? కష్టంగా ఉందా? అయితే ఒక చిన్న క్లూ ఇస్తే ఇట్టే గుర్తుపడతారు.. ఈ ముద్దుగుమ్మకు సినిమా ఇండస్ట్రీలో జూనియర్‌ సౌందర్యగా పేరుంది. ఈ పాటికే అర్థమై ఉంటుందా? మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్‌ ఆమె మరెవరో కాదు అందాల తార స్నేహ. ఈరోజు ఈ సొగసరి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు. అలాగే స్నేహ చిన్ననాటి, అరుదైన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పై ఫొటోస్‌ కూడా అందులోవే.

తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్నేహ. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇదే ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2012 మే 11న వీరిద్దరి వివాహం జరిగింది. ఆ తర్వాత తమ ప్రేమ బంధానికి గుర్తింపుగా ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చింది స్నేహ. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది మమ్ముట్టి సరసన క్రిస్టోఫర్‌ అనే సినిమాలో నటించింది స్నేహ. ప్రస్తుతం వెంకట్ ప్రభు, దళపతి విజయ్ కాంబినేషన్‌లో రానున్న తలపతి 68లో నటిస్తోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

ఇవాళ స్నేహ పుట్టిన రోజు..

భర్త , పిల్లలతో నటి స్నేహ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.