Actress: ఈ ముద్దుల పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్ హీరో కూతురు.. ఇప్పుడు హీరోయిన్ కూడా!

|

Jun 10, 2024 | 6:45 PM

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న ఈ క్యూట్ పాపను గుర్తు పట్టారా? ఈ బుజ్జాయి ఒక స్టార్ హీరో కూతురు. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా కూడా మారిపోయింది. అందరిలా కాకుండా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది

Actress: ఈ ముద్దుల పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్  హీరో కూతురు.. ఇప్పుడు హీరోయిన్ కూడా!
Tollywood Actress
Follow us on

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న ఈ క్యూట్ పాపను గుర్తు పట్టారా? ఈ బుజ్జాయి ఒక స్టార్ హీరో కూతురు. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా కూడా మారిపోయింది. అందరిలా కాకుండా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సినిమా ఇండస్ట్రీలో పురుషాధిపత్యం ఎక్కువగా ఉంటుందనే మాట ఉంది. అందుకు తగ్గట్టుగానే స్టార్ హీరోల కుమారులు వారుసులుగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెడతారు. అదే సమయంలో హీరోల కూతుళ్లు మాత్రం ఈ ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అరుదుగా అడుగుపెడతారు. ఈ కోవకు చెందుతుంది పైన ఉన్న హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుందామె. స్కిన్ షోకు దూరంగా ఉంటూ కేవలం కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటించింది. మరి ఈ ముద్దుల పాప ఎవరో గుర్తు పట్టరా? తను మరెవరో కాదు టాలీవుడ్ యంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్- జీవిత దంపతుల చిన్న కూతురు, అదే నండి మన దొరసాని శివాత్మిక రాజశేఖర్.

ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుద్దామనుకుంది శివాత్మిక. అందుకే
హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆనంద్ దేవర కొండ హీరోగా నటించిన దొరసాని చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి చిత్రంతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ సినిమాలో శివాత్మిక అభినయానికి గుర్తింపుగా సైమా పురస్కారం కూడా అందుకుంది. ఆ తర్వాత పంచ‌తంత్రం, రంగమార్తాండ సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేసింది. అలాగే తమిళంలో రెండు చిత్రాల్లో నటించింది. అయితే ఈ అమ్మడి తర్వాతి సినిమాల గురించి ఇంకా అప్ డేట్స్ రావాల్సి ఉంది.  ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోస్, వీడియోలకు ఫాలోవర్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

అమ్మానాన్నల అడుగు జాడల్లోనే శివాత్మిక కూడా..

సోషల్ మీడియాలోనూ శివాత్మికకు ఫుల్ ఫాలోయింగ్..

శివాత్మిక ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ …

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.