పై ఫొటోలో స్టైలిష్ డ్రెస్ లో క్యూట్ గా పోజులిస్తోన్నఅమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ లో ఈ భామ ఇప్పుడు క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. పేరుకు మలయాళ నటినే అయినా పక్కింటమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరవవుతోంది. తన అందం, అభినయంతో టాలీవుడ్ లో క్రమంగా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. కెరీర్ ప్రారంభంలోనే నాని, శర్వానంద్ లాంటి ప్రామిసింగ్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అందాల తార ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్నతెరకెక్కిస్తోన్న ఓజీలో ఈ బ్యూటీనే మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. ఇటీవల సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకున్న ప్రియాంక అరుళ్ మోహన్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా ఈ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఈ పోస్టుకు ఒక విశేషముంది. అదేంటంటే..
2019లో కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ప్రియాంక మోహన్. అదే సంవత్సరం న్యాచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైందీ అందాల తార. ఇప్పుడీ సినిమా రిలీజై 5 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా తన కెరీర్ కు మంచి పునాదినిచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా గురించి చెబుతూ ఇలా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది ప్రియాంక. ఈ సందర్భంగా తనకు అవకాశమిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.
కాగా గ్యాంగ్ లీడర్ తర్వాత శర్వానంద్ తో కలిసి ‘శ్రీకారం’ సినిమా చేసింది ప్రియాంక. అలాగే పలు తమిళ్ సినిమాల్లోనూ మెరిసింది. సూర్య, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి దృష్టంతా పవన్ కల్యాణ్ ఓజీ సినిమాపైనే ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.