
పై ఫొటోలో ఉన్న నూనూగు మీసాలతో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. హీరోగానే కాకుండా విలన్ గానూ, సహాయక నటుడిగానూ మెప్పిస్తున్నాడు. తన సూపర్బ్ ట్యాలెంట్ తో అందరి మన్ననలు అందుకుంటున్నారు. అయితే ఇతను కూడా మొదట సినిమాల్లోకి రావాలనుకోలేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లో డిస్టంక్షన్ లో పాసయ్యాడు. ఐబీఎమ్ లాంటి కార్పొరేట్ ఐటీ దిగ్గజ సంస్థల్లో పని చేశాడు. అయితే నటనపై ఆసక్తితో లక్షల జీతం, లగ్జరీ లైఫ్ ను వదిలి పెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ ఇక్కడ రాణించాలంటే అంత ఈజీ కాదు. అందుకే కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల పక్కన సైడ్ రోల్స్ చేశాడు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కల్యాణ్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చితకా రోల్స్ చేశాడు. తనకొచ్చిన చిన్న అవకాశాన్నైనా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. సోలో హీరోగా అదృష్టం పరీక్షించుకుని సక్సెస్ అయ్యాడు. కేవలం హీరోగానే కాకుండా అవసరమైతే విలన్, సహాయక నటుడి పాత్రలతోనూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.
ఈ హీరో ట్యాలెంట్ ను చూసి మెగాస్టార్ చిరంజీవి సైతం మురిసిపోయారు. ఓ సినిమా ఈవెంట్ లో తన మూడో తమ్ముడంటూ కితాబు కూడా ఇచ్చేశారు. ఇక రీసెంట్ గా ఓ డైరెక్టర్ ఈ హీరోను నెక్ట్స్ కమల హాసన్ అంటూ ఆకాశానికెత్తేశాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు హీరో సత్యదేవ్. రావు బహదూర్ సినిమా రీలీజ్ నేపథ్యంలో ఈ హీరో చిన్ననాటి ఫొటోలు, వీడియోలు తెగ వైరలవుతున్నాయి.
రావు బహదూర్ సినిమా విషయానికి వస్తే.. కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకటేష్ మహా ఈ మూవీని రూపొందించాడు. మలయాళం హీరోయిన్ దీపా థామస్ కథానాయికగా చేసింది. జులై 03న విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ తో రన్ అవుతోంది.
.@ActorSatyaDev what a performance! You didn’t just play Ramappa, you lived him. Vulnerability , madness & emotions were super.
The final climax reveal changes ur perspective of film.Beautifully written, brilliantly executed @mahaisnotanoun #RaoBahadur pic.twitter.com/90Re5U4tW0
— Ammu (@Itsmeammu99) July 4, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి