Ram Pothineni and Genelia : రామ్ ను ఆటపట్టించిన జెనీలియా.. ఫన్నీ వీడియోను షేర్ చేసిన

ఎనర్జిటిక్ హీరో రామ్ , అందాల భామ జెనీలియా కలిసి నటించిన సినిమా రెడీ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Ram Pothineni and Genelia : రామ్ ను ఆటపట్టించిన జెనీలియా.. ఫన్నీ వీడియోను షేర్ చేసిన
రామ్ ను ఆటపట్టించిన జెనీలియా

Updated on: Mar 15, 2021 | 5:12 PM

Ram Pothineni and Genelia : ఎనర్జిటిక్ హీరో రామ్ , అందాల భామ జెనీలియా కలిసి నటించిన సినిమా రెడీ మూవీ గుర్తుందా..అంత ఈజీగా ఎవ్వరు మర్చిపోరులెండి..అంతలా మ్యాజిక్ క్రియేట్ చేసింది ఆ మూవీ.  శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన రెడీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రామ్ కెరియర్ లో అలాగే జెనీలియా కెరియర్ లో ఈ సినిమా పెద్ద హిట్ గా నిలించింది. ఇక అప్పటినుంచి ఈ ఇద్దరు మంచి స్నేహితులు అయిపోయారు. అప్పుడప్పుడు ఈ ఇద్దరు పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. రామ్ ముంబై వెళ్ళినప్పుడు. జెనీలియా హైదరాబాద్ వచినప్పు రామ్ ఇంటికి వెళ్తూ ఉంటారు. జెనీలియా భర్త రితేష్ దేశముఖ్ తో రామ్ సందడి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా మరోసారి రామ్ జెనీలియా కలిసి సందడి చేసాడు.

ఇద్దరు కలిసి రెడీ మూవీలోని ‘అయ్యో అయ్యో అయ్యో దానయ్య.. మీ కుర్రాళ్లంతా బకరాగాల్లయ్యా’ అనే పాటకు స్టెప్పులు వేశారు. అయితే  ఈ పాటలో డాన్స్ చేస్తూ మరోసారి కిందపడినంత పని చేసింది జెనీలియా. దాంతో రామ్ ఒక్కసారిగా నవ్వేసాడు.అందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో జెనీలియా షేర్ చేసింది. ఇటీవ‌ల స్కేటింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డ జెనీలియా చేతి క‌ట్టుతో కనిపించింది.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో ప్రేక్షకులను , అభిమానులను ఆకట్టుకుంటుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :  ‘డోంట్ రష్’లో భాగంగా అదరగొడుతున్న సెలబ్రిటీలు.. వైరల్ అవుతున్న సమంత, లావణ్య త్రిపాఠి డ్యాన్స్ వీడియోలు

Jr NTR : ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. బాధ్యతలు తీసుకుంటున్న తారక్.. త్వరలోనే..

Aishwarya Rai : ముద్దు గురించి ముచ్చటిస్తున్న ఐశ్వర్యారాయ్.. ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు..!

Loading...
Unable to load recommendations.
Follow Us