Geethanjali: గీతాంజలి మళ్లీ వచ్చింది.. అంజలి సినిమా ఇలా అయిపోయింది ఏంటి..?

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు హీరోయిన్‌గా గీతాంజలి కనిపిస్తుంది. కానీ అంజలి పాత్రకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు. సత్య, సునీల్‌ కామెడీ ట్రాక్‌తోనే అంతో ఇంతో ఈ సినిమా నిలబడే ఛాన్స్ ఉంది. కానీ కాస్తో కూస్తో పాజిటివ్ రివ్యూలు సైతం కలెక్షన్లను పెంచలేకపోయాయనిపిస్తోంది.

Geethanjali: గీతాంజలి మళ్లీ వచ్చింది.. అంజలి సినిమా ఇలా అయిపోయింది ఏంటి..?
Geethanjali Malli Vachindi
Follow us

|

Updated on: Apr 15, 2024 | 10:08 PM

అంజలి నటించిన గీతాంజలి సినిమా గుర్తుందా..? హారర్ కామెడీ జానర్‌లో పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈ ఫార్మాట్‌లో చాలా సినిమాలు వచ్చాయి. పాయింట్ కొత్తగా ఉంటే తప్పితే.. సినిమాలు ఈ జోనర్‌ను ఎంకరేజ్ చేయడం లేదు. సో.. సోగా ఉన్నా కూడా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూడొచ్చలే అనుకుంటున్నారు. అలాంటి ఈ తరుణంలో సరైన కథ, ట్రీట్మెంట్ లేకుండా సినిమా వస్తే.. రెండు రోజుల్లోనే చుట్టేయడం ఖాయం.  వస్తే థియేటర్లో డిజాసర్ట్ అవ్వడం ఖాయం. పెద్ద పెద్ద స్టార్లు చేసినా కూడా చాపు సర్దేసుకోవాల్సిందే.

తాజాగా  గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో అలాంటి కాన్సెప్ట్ మళ్లీ టచ్ చేశారు. కానీ అంజలి పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. సత్య, సునీల్‌ పాత్రలే మెయిన్ లీడ్స్. ఆ ఇద్దరి కామెడీ ట్రాక్‌ మాత్రమే పర్లేదు అనిపిస్తుంది. అయితే ద్వితీయార్థంలో వచ్చే..  ఓ అరగంట కామెడీ ట్రాక్ కోసం జనాలు మిగతా సినిమా అంతా భరిస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. దీంతో కలెక్సన్స్ చాలా నిరాశాజనకంగా ఉన్నాయి.  అసలు ఈ మూవీ వచ్చిన కలెక్షన్లు గురించి కూడా పెద్దగా చర్చ జరగడం లేదు.

ఇక గీతాంజలి మూవీ దాదాపు 10 కోట్ల బడ్జెట్ అని కొందరు.. ఈ మూవీ 3 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిందని మరికొందరు చెప్తున్నారు. అయితే విడుదలయ్యాక ఇప్పటి వరకు కోటి నుంచి కోటిన్నర షేర్ వచ్చిందని ట్రేక్ వర్గాల టాక్. గత వారం బాక్సాఫీస్ వద్ద డీజే టిల్లు స్టాండర్డ్ రెవిన్యూ సాధించాడు. విజయ్ ఫ్యామిలీ ఓ మాదిరి కలెక్షన్స్ రాబట్టింది. ఇక మూడో స్థానంలో అత్యంత తక్కువ కలెక్షన్లు వచ్చాయి గీతాంజలికి. యాభై కోట్లు రావాలన్న కోన వెంకట్ ఆశలు మాత్రం నెరవేరేలా లేవు. ఓవర్సీస్‌లో కనీసం ఇప్పటి వరకు లక్ష డాలర్లను వసూలు చేయలేదని రిపోర్టులు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.