Gandeevadhari Arjuna Teaser: వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ టీజర్ వచ్చేసింది.. హాలీవుడ్ రేంజ్‏లో యాక్షన్ సీన్స్..

|

Jul 24, 2023 | 10:51 AM

స్పై యాక్షన్ థ్రిల్లర్‏గా రాబోతున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుండగా.. విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హోప్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తే ఈసారి ఫుల్ యాక్షన్ హీరోగా అదరగొట్టేందుకు వరుణ్ సిద్ధమయ్యినట్లుగా తెలుస్తోంది.

Gandeevadhari Arjuna Teaser: వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున టీజర్ వచ్చేసింది.. హాలీవుడ్ రేంజ్‏లో యాక్షన్ సీన్స్..
Gandeevadhari Arjuna Teaser
Follow us on

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫుల్ యాక్షన్ ఫాంలో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ నటిస్తోన్న సినిమా గాండీవధారి అర్జున. స్పై యాక్షన్ థ్రిల్లర్‏గా రాబోతున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుండగా.. విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హోప్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తే ఈసారి ఫుల్ యాక్షన్ హీరోగా అదరగొట్టేందుకు వరుణ్ సిద్ధమయ్యినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తూ మూవీపై మరిన్ని అంచనాలను పెంచేశారు మేకర్స్.

గతంలో విడుదలైన ప్రీ టీజర్‏లో ఓ రేంజ్ యాక్షన్ స్టంట్స్ చూపించారు మేకర్స్. ఇక ఇప్పుడు విడుదైలన టీజర్‏లో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్స్ సీన్స్ చూపించారు. వరుణ్ తేజ్.. హాలీవుడ్ మూవీ స్థాయిలో ఛేజ్ సీక్వెన్స్, అండర్ కవర్ ఆపరేషన్స్, అదిరిపోయే స్టంట్స్‏తో హైప్ క్రియేట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ సాక్షి వైద్య సైతం యాక్షన్ స్టంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే మిక్కీ జే మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం అదిరిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 25న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.