ఎందుకు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అంత పెద్ద హిట్ అయింది? ఆసక్తికర కారణాలు

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ సిరీస్‌లలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ప్రత్యేక స్థానం ఉంది. డ్రాగన్లు, రాజ్యాలు, యుద్ధాలు, కుట్రలు, ప్రేమలు, ద్రోహాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సిరీస్.. టీవీ చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచిపోయింది. పూర్తి వివరాలు కథనంలో ...

ఎందుకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంత పెద్ద హిట్ అయింది?  ఆసక్తికర కారణాలు
Game Of Thrones

Updated on: Aug 26, 2026 | 12:02 PM

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ సిరీస్‌లలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. డ్రాగన్లు, రాజ్యాలు, యుద్ధాలు, కుట్రలు, ప్రేమలు, ద్రోహాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సిరీస్.. టీవీ చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచిపోయింది. ఐరన్ థ్రోన్‌పై ఆధిపత్యం కోసం జరిగే పోరాటమే కథకు కేంద్రబిందువు. వెస్టెరోస్‌లోని రాజ కుటుంబాలు, శక్తివంతమైన నాయకులు, యోధులు.. తమకు కావాల్సిన అధికారం కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. ఎవరు ఎప్పుడు మిత్రుడిగా మారతారో, ఎప్పుడు శత్రువుగా మారతారో ఊహించలేని విధంగా కథ సాగుతుంది.

ఈ సిరీస్‌లో ప్రత్యేకత కేవలం భారీ యుద్ధ సన్నివేశాలు లేదా డ్రాగన్లు మాత్రమే కాదు. ఒక చిన్న రహస్యం, ఒక ద్రోహం, ఒక మాట.. మొత్తం రాజ్య భవిష్యత్తునే మార్చగలవు. అందుకే ప్రేక్షకులు ప్రతి ఎపిసోడ్‌ను ఉత్కంఠతో చూసేలా కథను తీర్చిదిద్దారు. ఇక డెనెరిస్ టార్గారియన్‌ పాత్రకు డ్రాగన్లు మరో ప్రత్యేక ఆకర్షణ. తన కుటుంబం కోల్పోయిన అధికారాన్ని తిరిగి సాధించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఆమె ప్రయాణం.. క్రమంగా ఓ మహా శక్తిగా ఎదిగే కథగా మారుతుంది. మరోవైపు జాన్ స్నో ప్రయాణం కూడా సిరీస్‌లో అత్యంత ఆసక్తికరమైన కథాంశాల్లో ఒకటి.

అయితే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో నిజమైన భయం డ్రాగన్లది కాదు.. అధికారం కోసం మనుషులు ఒకరిపై ఒకరు చేసే కుట్రలదే. ఎవరినీ పూర్తిగా హీరోగా, ఎవరినీ పూర్తిగా విలన్‌గా చూపించకుండా పాత్రలను తీర్చిదిద్దడం ఈ సిరీస్‌కు మరో బలం. మంచి వ్యక్తి కూడా పరిస్థితుల కారణంగా తప్పు నిర్ణయం తీసుకోవచ్చు. విలన్‌గా కనిపించిన వ్యక్తిలోనూ మానవత్వం కనిపించొచ్చు.

అందుకే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఒక సాధారణ ఫాంటసీ సిరీస్‌గా కాకుండా.. అధికారం, నమ్మకం, ద్రోహం, ప్రతీకారం, కుటుంబం, నాయకత్వం చుట్టూ తిరిగే భారీ కథగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. సిరీస్ ముగిసిపోయినా.. ఐరన్ థ్రోన్ కోసం జరిగిన పోరాటం, స్టార్క్ కుటుంబం, టార్గారియన్లు, డ్రాగన్లు, వెస్టెరోస్ ప్రపంచం గురించి చర్చ మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే సగేమ్ ఆఫ్ థ్రోన్స్‌ను ఒక సిరీస్‌గా మాత్రమే చూడలేం.. ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఒక సంచలనంగా గుర్తుండిపోయే ఫాంటసీ గాథగా చెప్పుకోవచ్చు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us