
సినిమా పాటలే కాదు ప్రస్తుతం ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ ఊపేస్తున్నాయి. అకేషన్ ఏదైనా ఫోక్ సాంగ్స్ ఉండాల్సిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా సాంగ్స్ కు విపరీతంగా వైబ్ అవుతున్నారు జనాలు. అలాగే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎన్నో రకాల ఫోక్ సాంగ్స్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన సాంగ్స్ సినిమా సాంగ్స్ కు మించి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంతే కాదు కొన్ని సాంగ్స్ ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. విదేశాల్లోనూ మన పాటలకు స్టెప్పులేస్తున్నారు సాంగ్ లవర్స్.
ఇక తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వస్తుంది. ఇప్పటికే రాను బొంబాయికి రాను సాంగ్, ఓ పిలగ వెంటేశు, అలాగే మరికొన్ని సాంగ్స్ భారీ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఫోక్ సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపిస్తుంది. ఈ సాంగ్ వచ్చి 11 నెలలు అవుతుంది. ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఎంతోమంది ఈ సాంగ్ కు వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ సాంగ్ పేరు రింగు రింగుల జుట్టుదానా.. ఈ సాంగ్ ఇప్పటికే 84 మిలియన్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ ను రాను బొంబాయికి రాను ఫేమ్ రాము రాథోడ్, ప్రభ ఆలపించారు. అలాగే రాము రాథోడ్ , లిఖిత డాన్స్ అదరగొట్టారు. ఈ సూపర్ ఫోక్ సాంగ్ కు కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించాడు. సురేష్ గంగుల, దేవ్ పవర్ సాహిత్యం అందించారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తోంది.. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.