ఇలియానా చాలా కాలం తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలం హవా కొనసాగించింది. మొదటి చిత్రం దేవదాస్‌తోనే ఈ గోవా బ్యూటీ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత పోకిరి సినిమాతో టాప్ హీరోయిన్ ప్లేస్‌ను దక్కించుకుంది. ఇలా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అయ్యాక బీ టౌన్ వైపు ఎగిరిపోయింది. కానీ అక్కడ పెద్ద సక్సస్ దొరకలేదు. ఆ తరువాత మళ్లీ టాలీవుడ్ వైపు ఓ కన్నేసింది.. ఇక్కడ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక్కడా వర్కవుట్ కాలేదు. దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ అంటూ డిజాస్టర్లతో ఇలియానా ఫేడవుట్ అయిపోయింది.
ఇలా మళ్లీ తిరిగి బాలీవుడ్‌కే వెళ్లింది. కానీ ఇంత వరకు ఇలియానాకు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ దక్క లేదు. దీంతో వెండితెర మీద కూడా ఈ సుందరికి పెద్దగా అవకాశాలు దక్కడంలేదు… దీనికితోడు ప్రియుడితో బ్రేకప్ అవడంతో.. ఏంచేయాలో ఊసు పోక సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెడుతోంది.
అయితే ఇలియానా తాజాగా సినీ పరిశ్రమ గురించి సంచలన కామెంట్లు చేసింది. ఇండస్ట్రీ చాలా ఘోరమైంది.. ఇక్కడ టాలెంట్ ఎంత ఉన్నా పనికి రాదు. జనాలు మమ్మల్ని చూసినంత వరకు మాకు చాన్స్‌లు వస్తుంటాయి.. వారు మా సినిమాలను చూడటం మానేస్తే మా పని అయిపోయినట్టే. అయినా మన జీవితంలో అన్నీ కూడా మనకు నచ్చినట్టే జరగవంటూ వేధాంత ధోరణిలో కామెంట్ చేసింది.
పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని.. అయితే నా విషయానికి వస్తే.. ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తాను అని ఇలియానా చెప్పుకొచ్చారు.