RRR Movie: ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర నయా కల్చర్.. హాల్ దగ్గర అభిమాని గన్‌తో హల్ చల్

RRR Movie: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా మానియా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా రౌద్రం రణం రుధిరం మాటే. మెగా, నందమూరి ఫ్యాన్స్..

RRR Movie: ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర నయా కల్చర్.. హాల్ దగ్గర అభిమాని గన్‌తో హల్ చల్
Fans Hungama At Rrr Theatre

Updated on: Mar 25, 2022 | 12:55 PM

RRR Movie: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా మానియా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా రౌద్రం రణం రుధిరం మాటే. మెగా, నందమూరి ఫ్యాన్స్ (Mega, Nandmuri) ఆర్ఆర్ఆర్ థియేటర్స్ దగ్గర హంగామా చేస్తున్నారు. ఫేవరేట్‌ హిరో సినిమా రిలీజ్‌ అయితే, పాలాభిషేకాలు, పూలమాలలు కామన్.  తాజాగా ఓ సినిమా థియేటర్ దగ్గర అభిమానం హద్దులు దాటిన ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా(East Godavari District)లోని ట్రిపుల్ ఆర్ థియేటర్ దగ్గర నయా కల్చర్‌ స్క్రీన్‌ మీదికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణా థియేటర్ లో RRR సినిమా ప్రదర్శిస్తున్నారు. ఈ థియేటర్ వద్ద దగ్గర ఓ అభిమాని గన్ తో హల్చల్ చేశాడు. ముందు సినిమా ధియేటర్ బయట గన్ తో ఫోజులిచ్చాడు.  అక్కడితో ఆగకుండా, అనంతరం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శిస్తున్న సమయంలో సినిమా ధియేటర్ లోని  తెరముందు గన్ తో తిరుగుతూ కెరింతలు కొట్టాడు.

అయితే యువకుడి గన్ పట్టుకుని చేసిన హంగామా చూసి థియేటర్ లోని ప్రేక్షకులు షాక్ తిన్నారు. ఆ యువకుడి చేతిలో ఉన్న తుపాకీ నిజమైందా లేక డమ్మినా తెలియక అభిమానులు నివ్వెరబోయారు. ఆ యువకుడు పిఠాపురం చెందిన వ్యక్తి హసామిగా చెబుతున్నారు. అయితే ఆ యువకుడు గన్..తో 1 బులెట్ కాల్చిన దృశ్యం టీవీ9 కంట పడింది.

 

Also Read: Yadadri Temple: నరసింహుడు ఐదు రూపాల్లో దర్శనమిచ్చే క్షేత్రం.. స్వామివారు పాంచ నరసింహుడిగా ప్రసిద్ధి..

RRR Movie Theater: ఆర్ఆర్ఆర్ థియేటర్‌లో తీవ్ర విషాదం.. సినిమా చూస్తూ ఓ అభిమాని గుండెపోటుతో మృతి