
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ హావ నడుస్తుంది. సినిమా సాంగ్స్ కు పోటీ పడుతూ ఫోక్ సాంగ్స్ రిలీజ్ అవుతూ సంచనల విజయాలను అందుకుంటున్నాయి. సినిమా పాటలను మించి క్రేజ్ తెచ్చుకుంటూ దూసుకుపోతుంటాయి ఫోక్ సాంగ్స్.. ఇప్పటికే పదుల సంఖ్యలో ఫోక్ సాంగ్స్ ప్రతి నెల యూట్యూబ్ లో విడుదలవుతూ సందడి చేస్తున్నాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే మిళియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని పాటలు పాన్ ఇండియా రేంజ్ లోనూ సందడి చేస్తున్నాయి.. మన ఫోక్ సాంగ్స్ కు దేశ విశేషాల్లో ఉన్న వారు కూడా స్టెప్పులేస్తున్నారు. ఆ మధ్య విడుదలైన రాను బాబాయ్ కి రాను సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఆ సాంగ్ రేంజ్ లోనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ కూడా హిట్ అయ్యింది.
ఈ సాంగ్ వచ్చి 5ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ ఈ సాంగ్ క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడా వినిపించిన స్టెప్పులేయాల్సిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఈ సాంగ్ కు డాన్స్ తో దుమురేపుతున్నారు. ఆ సాంగ్ మరేదో కాదు మన అందరికి బాగా తెలిసిన బుల్లెట్ బండి సాంగ్.. ఈ సాంగ్ చాలా మంది ఫేవరెట్ సాంగ్.. ఆడపిల్ల భవనాలు అందంగా చూపించారు. అలాగే ఈ పాటలోని లిరిక్స్ కూడా భలే ఉంటాయి.
బుల్లెట్ బండి సాంగ్ విడుదలై 5ఏళ్లు అవుతుంది. ఇప్పటికే 500మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది ఈ సాంగ్. సింగర్ మోహన భోగరాజు ఈ పాటను పాడటంతో పాటు ఈవీడియోలోనూ యాక్ట్ చేసింది. ఎస్ కే బాజీ సంగీతం అందించిన ఈ పాటను లక్ష్మణ్ రచించారు. ఈ పాట యూట్యూబ్ లోనే కాదు మ్యూజిక్ యాప్స్ తో స్పాటిఫై , వింక్ , ఆపిల్ మ్యూజిక్ ల్లోనూ టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి