Tollywood: చిరు, బాలయ్యల మధ్య ఆ పాప ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ బడా సెలబ్రిటీ

బాలకృష్ణ, చిరంజీవి మధ్యలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? ఆమె ఇండస్ట్రీలో చాలా ఫేమస్. చాలా బ్యాగ్రౌండ్ ఉన్న పర్సన్. గెస్ చేయగలరా..? తెలిస్తే ఈమేనా..? అంటూ ఆశ్చర్యపోతారు.

Tollywood: చిరు, బాలయ్యల మధ్య ఆ పాప ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ బడా సెలబ్రిటీ
Tollywood Celebrity

Updated on: Aug 23, 2024 | 1:29 PM

తెలుగునాట చిరు, బాలయ్య టాప్ హీరోలు అన్న సంగతి తెలిసిందే. ఇద్దరికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే కోలాహాలం మాములుగా ఉండదు. బాక్సాఫీస్ వద్ద ఈ ఇరువురి హీరోల ఫైట్‌ను కూడా అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. కుర్ర హీరోలకు ధీటుగా ఈ సీనియర్ హీరోలు.. డ్యాన్స్‌లు, ఫైట్లు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.  కెరీర్ పరంగా స్నేహపూర్వక పోటీ ఉన్నప్పటికీ.. బయట వీరిద్దరూ కలిస్తే.. చాలా క్లోజ్‌గా ఉంటారు. ఎంతో సరదాగా మాట్లాడుకుంటారు. కాగా పైన ఫోటోలో బాలయ్య, చిరంజీవి మధ్య నవ్వుతూ నిల్చున్న ఆ పాప ఎవరో మీరు గుర్తుపట్టారా..?. ఇండస్ట్రీలో ఆమె బడా సెలబ్రిటీ. గెస్ చేయండి.. అయ్యో కష్టం అంటే ఆన్సర్ దిగువన ఉంది తెలుసుకుందాం పదండి…

ఆమె మరెవరో కాదండోయ్.. వైజయంతి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తనయ ప్రియాంక దత్. ప్రియాంక దత్ కూడా ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆమె.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను వివాహమాడింది.  ఇద్దరు సీనియర్ స్టార్ సెలబ్రిటీస్ మధ్య నిలబడి తీసుకున్న ప్రియాంక దత్ చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇక ప్రియాంక దత్ చిన్ననాటి ఫోటో చూసిన నెటిజన్స్ ఆమె ఈమెనా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రియాంక దత్ కూడా తండ్రి మార్గంలోనే నడుస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. కాగా, ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత త్రీ ఏంజల్స్ స్టుడియో ఏర్పాటు చేసి..  బాణం, ఓం శాంతి, సారొచ్చారు సినిమాలను నిర్మించారు. దీనితోపాటు యాదోం కీ బరాత్ అనే లఘు చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇప్పుడు సోదరి స్వప్న దత్‌తో కలిసి..  తండ్రి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోన్న సినిమాల బాధ్యతలు చూసుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.