సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు చేస్తున్నసినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కథను కూడా సిద్ధం చేశారు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇప్పటికే మహేష్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబుకు సంబందించిన త్రో బ్యాక్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న బ్యూటీ. తన అందాలతో కుర్రాళ్లకు హృదయాలకు గాలులు వేస్తుంది ఈ వయ్యారి.
పై ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉన్న చిన్నది చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజీ సొంతం చేసుకుంది. ఆ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు ఇటీవలే మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి హిట్ అందుకున్న రమ్యపసుపులేటి. ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. టిక్ టాక్ వీడియోలు ఆ తర్వాత ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకున్న ఈ బ్యూటీ. హుషారు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమాలో చిన్న పాత్ర చేసింది. తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇక రీసెంట్‌గా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుంది రమ్య. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటిస్తుంది రమ్య. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యూట్ నెస్ తో పాటు అందాలతో ఆకట్టుకుంటోంది రమ్య పసుపులేటి. అందాలు ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది ఈ వయ్యారి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.