
అయన పేరే ఓ సెన్సేషన్, ఆయనకు ఉండే క్రేజ్ నెక్స్ట్ లెవల్.. స్టార్ హీరో కాకపోయినా… ఆ రేంజ్ లో పాపులర్ అయ్యాడు ఆ నటుడు. పలు రకాల వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకుల మెప్పు పొందాడు. విభిన్నమైన కథలతో సినిమాలు చేసి విశేషంగా ఆకట్టుకున్నాడు. నిన్నటి వరకు కడుపుబ్బా నవ్వించిన ఆయన ఇక ఇప్పుడు రూటు మార్చి.. మాస్ లుక్ లో భయపెట్టడానికి వస్తున్నాడు. ఇంతకూ పై ఫొటోలో ఉన్న మోస్ట్ ఫెమస్ యాక్టర్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది ఆయన ఎవరో కనిపెట్టలేక పోవచ్చు.. కష్టపడకండి మీ కోసం మేమే ఆయన ఎవరో రివీల్ చేస్తాం.. ? పేరు చెప్పగానే షాక్ అయ్యి షేక్ అవుతారు జాగ్రత్త..
పై ఫొటోలో మాస్ కా బాప్ లుక్ లో అదరగొట్టింది మరెవరో కాదు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు . హీరో అంటే హ్యాండ్సమ్‌గా ఉండాలి, మంచి బాడీ ఉండాలి, డాన్స్ స్కిల్స్ ఉండాలి అని అనుకుంటారు. కానీ అలాంటివి ఏమీ లేకుండా హిట్స్ అందుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సంపూర్ణేష్. సోషల్ మీడియా ద్వారా సంపూర్ణేష్ బాబు మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక హృదయకాలేయం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సెటైరికల్ మూవీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఆతర్వాత కొబ్బరిమట్ట , సింగం 123 లాంటి సినిమాల్లో మెప్పించారు. అలాగే కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ లోనూ నటించి మెప్పించాడు సంపూర్ణేష్. ఇక ఇప్పుడు రూటు మార్చి మాస్ అవతార్ లో దర్శనమిచారు. కొంతకాలంగా సంపూర్ణేష్ బాబు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా తాజాగా ఆయన లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఇక పై సంపూర్ణేష్ బాబు కామెడీ నటుడు కాదు అంటూ సోషల్ మీడియాలో ఆయన లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ అదిరిపోయింది. సంపూని సరికొత్త లుక్ లోనే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో చూపించనున్నాడు దర్శకుడు శ్రీకాంత్. అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటిస్తున్నారు.
Sampoornesh Babu won’t be FUNNY anymore.@sampoornesh as ‘BIRYANI’ – Jadal’s friend… 🤗🤗#TheParadise pic.twitter.com/zUJ3G0zpgk
— Srikanth Odela (@odela_srikanth) December 19, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.