Happy Days: ‘హ్యాపీ డేస్’ టైసన్ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు! లేటెస్ట్ ఫొటోస్ చూస్తే స్టన్ అవుతారంతే

వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ, గాయత్రీ రావు, టైసన్ (రాహుల్), సోనియా దీప్తి, కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీరందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఇదే సినిమాలో బక్కపలుచగా కళ్లజోడుతో కనిపిస్తూ సీనియర్ అమ్మాయిని లవ్ చేసే టైసన్ పాత్ర అందరికీ గుర్తుండిపోతోంది.

Happy Days: 'హ్యాపీ డేస్' టైసన్ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు! లేటెస్ట్ ఫొటోస్ చూస్తే స్టన్ అవుతారంతే
Happy Days Movie
Follow us

|

Updated on: Aug 07, 2024 | 8:13 PM

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ హ్యాపీ డేస్. 2007లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసి ఫిదా అయిపోయారు. ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్త వారే నటించారు. వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ, గాయత్రీ రావు, టైసన్ (రాహుల్), సోనియా దీప్తి, కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీరందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఇదే సినిమాలో బక్కపలుచగా కళ్లజోడుతో కనిపిస్తూ సీనియర్ అమ్మాయిని లవ్ చేసే టైసన్ పాత్ర అందరికీ గుర్తుండిపోతోంది. ఫన్ తో పాటు ఎమోషనల్ మిక్స్ చేసిన ఈ పాత్రలో రాహుల్ అద్భతంగా నటించాడు. ముఖ్యంగా సోనియా దీప్తి (శ్రావ్స్) కాంబినేషన్ లో వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. దీంతో ఆ తర్వాత కూడా టైసన్ పేరుతో నే ఫేమస్ అయిపోయాడు రాహుల్. అయితే హ్యాపీడేస్ మూవీ తర్వాత రాహుల్ ఇండస్ట్రీలో పెద్దగా క్లిక్ కాలేకపోయాడు.

రెయిన్ బో, ముగ్గురు, ప్రేమ ఒక మైకం, లవ్ యు బంగారం, వెంకటాపురం తదితర సినిమాల్లో నటించాడు రాహుల్ టైసన్. అయితే ఏ సినిమా కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో క్రమంగా అతనికి అవకాశాలు కూడా సన్నగిల్లిపోయాయి. 2017 లో వెంకటాపురం అనే సినిమాలో నటించిన రాహుల్ ఈ మధ్యనే మళ్లీ వెండితెరపై కనిపించాడు. యంగ్ హీరో కార్తికేయ నటించిన భజే వాయు వేగం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు రాహుల్. ఇందులో అజీజ్ రెడ్డి అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. సినిమా కూడా హిట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

రాహుల్ టైసన్ లేటెస్ట్ ఫొటోస్..

అయితే అప్పటికీ, ఇప్పటికీ రాహుల్ చాలా మారిపోయాడు. అప్పట్లో బక్క పలుచగా కనిపించిన అతను.. టైసన్ పేరకు తగ్గట్టుగానే సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. ప్రస్తుతం అతని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సిక్స్ ప్యాక్ బాడీతో టైసన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'హ్యాపీ డేస్' టైసన్ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు!
'హ్యాపీ డేస్' టైసన్ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు!
ఇకపై రోజుకు 25 గంటలు.. ఆ మార్పులతోనే అసలు సమస్య
ఇకపై రోజుకు 25 గంటలు.. ఆ మార్పులతోనే అసలు సమస్య
Afghanistan: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఓపెనర్‌పై 5 ఏళ్ల నిషేధం..
Afghanistan: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఓపెనర్‌పై 5 ఏళ్ల నిషేధం..
అక్కడ బొద్దింకలు బంగారంతో సమానం..! కేజీ ధర ఎంతో తెలిస్తే అవాక్కే!
అక్కడ బొద్దింకలు బంగారంతో సమానం..! కేజీ ధర ఎంతో తెలిస్తే అవాక్కే!
అరంగేట్రం మ్యాచ్‌లోనే తొలి భారతీయుడిగా రియాన్ పరాగ్ భారీ రికార్డ్
అరంగేట్రం మ్యాచ్‌లోనే తొలి భారతీయుడిగా రియాన్ పరాగ్ భారీ రికార్డ్
అనుకోని వివాదంలో చిక్కుకున్న సుమ.. వివరణ ఇచ్చిన స్టార్ యాంకర్
అనుకోని వివాదంలో చిక్కుకున్న సుమ.. వివరణ ఇచ్చిన స్టార్ యాంకర్
స్వస్థానమైన సింహ రాశిలోకి రవి..ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!
స్వస్థానమైన సింహ రాశిలోకి రవి..ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!
మై హోమ్‌ గ్రూప్‌నకు మూడు ప్రతిష్టాత్మక కేంద్ర అవార్డులు..
మై హోమ్‌ గ్రూప్‌నకు మూడు ప్రతిష్టాత్మక కేంద్ర అవార్డులు..
వ్యాపార అవసరాలకు కూడా క్రెడిట్ కార్డులున్నాయని తెలుసా?
వ్యాపార అవసరాలకు కూడా క్రెడిట్ కార్డులున్నాయని తెలుసా?
రాత్రి త్వరగా భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?
రాత్రి త్వరగా భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?