అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న ఈ హీరో ఎవరో కనిపెట్టారా.?

చాలా మందికి తమ అభిమాన నటులకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. వారి చైల్డ్ హుడ్ ఫొటోస్ చూడటానికి చాలా ఆసక్తి కనబరుస్తారు. ఈక్రమంలోనే ఓ టాలీవుడ్ హీరో చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న ఈ హీరో ఎవరో కనిపెట్టారా.?
Tollywood Hero

Updated on: Nov 24, 2026 | 12:24 PM

నెట్టింట త్రోబ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే  ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీల చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తమ చిన్నప్పటి జ్ఞాపకాలను నెట్టింట షేర్ చేస్తున్నారు చాలా మంది సినీ తారలు. స్టార్ హీరోహీరోయిన్స్ నుంచి సామాన్యుల వరకు ఈ ట్రెండ్ పేరుతో తమ  చిన్ననాటి మధురజ్ఞాపకాలను, అందుకు సంబంధించిన ఫోటోలను తమ సన్నిహితులతో ఫాలోవర్లకు షేర్ చేస్తున్నారు. ఇటీవల చాలా మంది సెలబ్రెటీలు ఇలా తమ చైల్డ్ హుడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్, అల్లు అర్జున్, అలియా భట్, నాగచైతన్య, కీర్తి సురేష్, రష్మిక మందన్నా, సమంత వంటి స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో యంగ్ హీరో త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

పైన ఫోటోను చూశారు కదా.? ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి. పై ఫొటోలో తల్లితో కూర్చున్న ఈ క్యూట్ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో. యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువే. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ కుర్రాహీరో ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? చాలా ఫెమస్ హీరో అతను.. అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉన్న హీరో అతను. ఆ క్యూట్ చిన్నోడు ఎవరో కాదు..

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. హ్యాపీ డేస్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్…ఆ తర్వాత యువత, స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయ2, 18 పేజెస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఈ హీరో ప్రధాన పాత్రలో ఓ హిస్టారికల్ సినిమా రాబోతుంది.  స్వయంభు అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో నభానటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us