అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ.. ఆమె ఎవరంటే

తెలుగు సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. అందం, అభినయంతో పాటు తెరపై తమదైన ముద్ర వేస్తారు. అలాంటి వారిలో ఈ అందాల భామ ఒకరు. చాలా కాలం తర్వాత ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధమైంది.

అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ.. ఆమె ఎవరంటే
Actress

Updated on: Oct 30, 2026 | 9:32 AM

ఒకప్పుడు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న పలువురు నటీమణులు ప్రస్తుతం సినీ రంగానికి దూరంగా ఉంటున్నారు. వారిలో కొందరు తిరిగి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతుండగా, మరికొందరు మాత్రం నటనకు దూరంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే, ఒకనాటి కుర్రాళ్ల కలల రాకుమారి ఇప్పుడు తిరిగి సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. అప్పట్లో తన అందంతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది ఆమె. ఆ తర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇంతకూ ఆ అందాల భామ ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ నమిత. నటి నమిత మళ్ళీ వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

నమిత తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేశారు. ఆమె తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు క్రమంగా దూరమయ్యారు. ఇప్పుడు, సుదీర్ఘ విరామం అనంతరం నమిత తిరిగి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గానూ నమిత మెప్పించారు. ప్రభాస్ నటించిన బిల్లా, బాలకృష్ణ నటించిన సింహ సినిమాలోనూ నమిత నటించారు. ఆతర్వాత ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.

యూట్యూబర్ డిజే సిద్దు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమాలో నమిత కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాలకు దూరం అయిన తర్వాత నమిత బొద్దుగా మారిపోయారు. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ నేపథ్యంలో ఆమె స్లిమ్ గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, నమిత సోషల్ మీడియాలో తన అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. ఆమె తన ఫోటోలు, జిమ్ వర్కౌట్‌లకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్త తెలియగానే, అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె తిరిగి తెరపై కనిపించడం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us