అమ్మబాబోయ్..! ప్రభాస్ సినిమా లేడీ విలన్ అరాచకం.. 54ఏళ్ల వయసులోనూ హీట్ పుట్టిస్తున్నబ్యూటీ

రెబల్ స్టార్ ప్రభాస్ ను ఇప్పట్లో ఆపడం ఎవరి తరం కాదు.. ఇది అభిమానులంటున్న మాట. చూడబోతే అది నిజమే అనిపిస్తుంది. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చుస్తే మీరు ఇదే అంటారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

అమ్మబాబోయ్..! ప్రభాస్ సినిమా లేడీ విలన్ అరాచకం.. 54ఏళ్ల వయసులోనూ హీట్ పుట్టిస్తున్నబ్యూటీ
Sahoo

Updated on: Aug 08, 2026 | 9:50 AM

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. వరుస సినిమాలతో ప్రభాస్ రెడీ అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. చివరిగా ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రభాస్ నటించిన సాహో సినిమా గుర్తుందా.? బాహుబలి 2 తర్వాత వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా భారీ హిట్ సొంతం చేసుకుంది. అంతే కాదు హిందీలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది సాహో సినిమా.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో నటించిన లేడీ విలన్ గుర్తుందా.? సాహో సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ సినిమాలో లేడీ విలన్ గా నటించిన ఆమె పేరు మందిరా బేడీ.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఫ్యాషన్ డిజైనర్, టీవీ యాంకర్, అలాగే నటి కూడా.. 1999లో దూరదర్శన్ లో ప్రసారమైన శాంతి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అదేవిధంగా సహాయక పాత్రల్లోనూ నటించి అదరగొట్టింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఈ బ్యూటీ వయసు 54 ఏళ్ళు అయినా కూడా తరగని అందంతో ఆకట్టుకుంటుంది. ఈ వయసులోనూ హాట్ లుక్ లో కనిపిస్తూ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us