NTR : ఎన్టీఆర్ సినిమాలో ఉన్న ఈ అమ్మడిని ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. హట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

|

Dec 09, 2024 | 4:28 PM

ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఊసరవెల్లి సినిమా ఒకటి. సురేందర్ రెడ్డి ఈ సినిమా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించిన ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

NTR : ఎన్టీఆర్ సినిమాలో ఉన్న ఈ అమ్మడిని ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. హట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్
Oosaravelli
Follow us on

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా భారీ విజయంతో పాటు.. కలెక్షన్స్ కూడా భారీగానే సొంతం చేసుకుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఎన్టీఆర్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఊసరవెల్లి సినిమా ఒకటి. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద సంగీతం అందించారు. ఊసరవెల్లి సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇది కూడా చదవండి : Tollywood : 14ఏళ్లకే ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు మూడు నిమిషాల పాటకు రూ. 2కోట్లు అందుకుంటుంది..

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో తమన్నా స్నేహితురాలిగా నటించిన ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె పేరు పాయల్ గోష్. ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆతరువాత తెలుగులో తక్కువ సినిమాలు చేసింది.

ఇది కూడా చదవండి :మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్.. చూస్తే ప్రేమలోపడిపోవాల్సిందే

ఊసరవెల్లి సినిమాతో పాటు మిస్టర్ రాస్కల్ అనే సినిమాలోనూ నటించింది ఈ భామ. ఇక పాయల్ ఘోష్.. సినిమాలతో కంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ అమ్మడు లైంగిక వేధింపుల నేపథ్యంలో అనురాగ్ కశ్యప్‌ పై సంచలన ఆరోపణలు చేసింది. అనురాగ్ తనను లైంగికంగా వేధించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 26 అక్టోబర్ 2020న ఆమె రాందాస్ అథవాలే రాజకీయ పార్టీలో చేరింది. ఇక పాయల్ ఘోష్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఈ అమ్మడు అప్పట్లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు కాంట్రవర్సీ క్వీన్ గా మారిపోయింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి :కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.