రాజన్న సినిమాలో నటించిన చిన్నారి.. ఇప్పుడు అందాలతో గత్తర లేపుతోందిగా.

|

Apr 24, 2024 | 7:15 PM

పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా.. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది ఆ చిన్నది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున నటించిన రాజన్న సినిమాలో మెప్పించింది. అనుకోకుండా ఒక రోజు సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది.

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి.. ఇప్పుడు అందాలతో గత్తర లేపుతోందిగా.
Actress
Follow us on

చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే తేజ సజ్జ కూడా హీరోగా రాణిస్తున్నాడు, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. అలాగే చాలా మంది తన నటనతో ఆకట్టుకుంటున్నారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా.. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది ఆ చిన్నది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున నటించిన రాజన్న సినిమాలో మెప్పించింది. అనుకోకుండా ఒక రోజు సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఆమె పేరు అన్నీ. రాజన్న సినిమాలో నాగార్జున కూతురు మల్లమ్మగా నటించింది అన్నీ.

అలాగే రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో చరణ్ సిస్టర్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉందో తెలుసా.. అన్నీ ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. చూడముచ్చటగా ఎంతో క్యూట్ గా ఉంది అన్నీ. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల్లో స్పీడ్ తగ్గించింది. ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది.

సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను బాగా పంచుకుంటుంది.  ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరూ ఈ బ్యూటీ ఫోటోల పై ఓ లుక్కేయండి.

అన్నీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.