అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో అదరగొట్టిన కుష్బూ కూతురు

|

Mar 29, 2024 | 7:28 PM

అటు రాజకీయాలు, ఇటు సినిమా రంగాల్లో బిజీగా ఉన్నారు కుష్బూ. సోషల్ మీడియాలో అభిమానులు ఖుష్బూ సుందర్ ఫోటోలను షేర్ చేస్తూ విష్ చేస్తున్నారు. తెలుగు,తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు కుష్బూ. ఇప్పటికీ ఆమె అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో అదరగొట్టిన కుష్బూ కూతురు
Kushboo
Follow us on

నేడు (మార్చ్ 29) సీనియర్ హీరోయిన్ కుష్బూ సుందర్ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా ఈ బ్యూటీకి అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. అటు రాజకీయాలు, ఇటు సినిమా రంగాల్లో బిజీగా ఉన్నారు కుష్బూ. సోషల్ మీడియాలో అభిమానులు ఖుష్బూ సుందర్ ఫోటోలను షేర్ చేస్తూ విష్ చేస్తున్నారు. తెలుగు,తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు కుష్బూ. ఇప్పటికీ ఆమె అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అమ్మ , అత్తా, వదిన పాత్రల్లో నటిస్తున్నారు కుష్బూ. ఇదిలా ఉంటే కుష్బూ కూతురిని ఎప్పుడైనా చూశారా..? ఆమె కూతురు అవంతిక హీరోయిన్స్ ను బీట్ చేసే అందంతో కవ్విస్తుంది. అవంతిక ఇప్పటికే నటనలో శిక్షణ కూడా పూర్తి చేసుకుంది. కానీ ఖుష్బూ సుందర్ ఆమెను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణం కూడా తెలిపింది కుష్బూ..

ఖుష్బూ సుందర్ కూతురు అవంతిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తుంది. అవంతిక విదేశాల్లో ఉంది. ఇటీవల ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తన ఒంటి పై టాటూ వేయించుకుంది అవంతిక. దీనిపై అభిమానులు కామెంట్లు చేశారు. అంతే కాదు హాట్ హాట్ ఫోటోలు పంచుకుంటూ కవ్విస్తుంది అవంతిక.

ఖుష్బూ, సుందర్ 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అవంతిక, ఆనందిత . చిన్న కూతురు ఆనందిత ‘అన్మోల్’ పేరుతో మేకప్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఖుష్బూ భర్త సుందర్ సి ప్రముఖ తమిళ దర్శకుడు. సినిమా రంగంలో మూడు దశాబ్దాలు ఉన్నారు ఆయన.

అవంతిక 2022లో నటనలో శిక్షణ పొందింది. ఈ విషయాన్ని ఖుష్బూ ముందే తెలియజేసింది. మాములుగా అయితే సెలబ్రిటీలు తమ పిల్లలను సినిమా పరిశ్రమకు పరిచయం చేసేందుకు చాలా ఆసక్తి చూపుతారు. కానీ, ఖుష్బూ అలా కాదు. ఇదే విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నా పెద్ద కూతురు నటనలో శిక్షణ పూర్తి చేసుకుంది. ఆమె లండన్‌లోని ప్రముఖ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ పొందింది. ప్రతిదీ తనంతట తానే తెలుసుకోవాలి..అన్ని తానే సంపాదించుకోవాలి అందుకే మేము అవంతికాను లాంచ్లే చేయలేదు. తన పేరును సిఫారసు చేయం కూడా… ఆమెకు మీ ఆశీస్సులు కావాలి’ అని ఖుష్బూ అన్నారు.

 అవంతిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

 అవంతిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

 అవంతిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.