Actress : అప్పుడు రొమాన్స్ రారాజుతో గ్లామర్ సెన్సేషన్.. కట్ చేస్తే.. టీమిండియా తోపు బౌలర్ భార్య..

బాలీవుడ్ సినీరంగంలో ఆమె రాత్రికి రాత్రే క్రేజ్ సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసింది. కానీ ఆకస్మాత్తుగా సినీరంగానికి దూరమైంది. ప్రస్తుతం ఆమె టీమిండియా తోపు బౌలర్ భార్య. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అందుకు కారణం ఆమె అందం, చరిష్మా.

Actress : అప్పుడు రొమాన్స్ రారాజుతో గ్లామర్ సెన్సేషన్.. కట్ చేస్తే.. టీమిండియా తోపు బౌలర్ భార్య..
Geetha Basra

Updated on: Mar 13, 2026 | 5:33 PM

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు రొమాంటిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. హిందీలో ఎన్నో హిట్ చిత్రాలతో నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఇమ్రాన్ హష్మీని ఒకప్పుడు సీరియల్ కిస్సర్ అని పిలిచేవాళ్లు. అప్పట్లో తన సినిమాలతో అంతగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు కథ నచ్చితే విలన్ పాత్రలు సైతం చేసేందుకు రెడీగా ఉంటున్నాడు. ముఖ్యంగా ఈ హీరోతో నటించి ఓవర్ నైట్ సెన్సేషన్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొందరు ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉండగా.. మరికొందరు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం.. ఇమ్రాన్ హష్మీతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఆమె టీమిండియా తోపు బౌలర్ భార్య. ఆమె పేరు గీతా బాస్రా.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

2006సో దిల్ దియా హై అనే చిత్రంలో ఇమ్రాన్ హష్మీతో కలిసి కలిసి నటించింది. ఈ సినిమాతో ఆమె ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది. గీతా 1984 మార్చి 13న ఇంగ్లాండ్‌లోని పోర్ట్స్‌మౌత్‌లో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించింది. భారతదేశానికి రాకముందు ఆమె క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలని కోరుకుంది. కానీ అనుహ్యంగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు హిందీలో ‘ది ట్రైన్’ (2007), ‘జిల్లా ఘజియాబాద్’ (2013), ‘మిస్టర్ జో బి. కార్వాల్హో’ (2014) వంటి చిత్రాలలో నటించింది. కానీ ఇమ్రాన్ సినిమాతోనే ఆమె పాపులర్ అయ్యింది.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే టీమిండియా క్రికెటర్ హర్బజన్ సింగ్ ను వివాహం చేసుకుంది. ది ట్రైన్ చిత్రంలోని వో అజ్నబీ అనే పాటలో గీతాను చూడగానే హర్బజన్ ప్రేమలో పడ్డాడు. ఆమె నంబర్ తెలుసుకుని యువరాజ్ సింగ్ ద్వారా సందేశం పంపించాడు. మొదట గీతా అతడిని పట్టించుకోలేదు. కానీ తర్వాత ఇద్దరి పరిచయం స్నేహంగా మారడం.. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు చేరింది. ప్రస్తుతం గీతా సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us