Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేకమంది టాలీవుడ్ స్టార్ హీరోల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ల అరుదైన ఫోటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని ఓ క్రేజీ హీరో ఫోటో ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. అతడి తండ్రి దక్షిణాదిలో తోపు హీరో.

Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
Pranav Mohanlal

Updated on: Apr 18, 2026 | 1:27 PM

సాధారణంగా సినీ నటీనటుల పాత ఫోటోలు తరచుగా సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. సినీ ప్రేమికులు వారి చిన్ననాటి ఫోటోలను ఆసక్తిగా చూస్తుంటారు. వీరిలో నటుడు మోహన్‌లాల్ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు, మోహన్‌లాల్ పిల్లలైన విస్మయ, ప్రణవ్‌ల చిన్ననాటి ఫోటోలు కూడా అంతే స్థాయిలో దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినీ నిర్మాత, మోహన్‌లాల్ చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీ పెరుంబవూర్ భార్య శాంతి, విస్మా , ప్రణవ్‌లు కలిసి ఉన్న ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిలో ఒకటి పాత చిత్రం కాగా, మరొకటి ఇటీవలిది. శాంతి ఈ చిత్రాలకు “ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ…” అని క్యాప్షన్ పెట్టారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..

మలయాళ చిత్రసీమలో బలమైన స్నేహం, బంధానికి ప్రతీక అయిన ఆంటోనీ పెరుంబవూర్ కుటుంబం గురించి ఒక కథ చెబుతుంది. కేవలం ఒక నిర్మాతగానే కాకుండా, మోహన్‌లాల్‌కు నీడలా, నమ్మకస్తుడిగా నిలిచే ఆంటోనీ, ప్రణవ్ , విస్మయలతో తనకున్న అనుబంధాన్ని ఎంతో భాద్యతగా భావిస్తారు.. ఏళ్ల క్రితం మోహన్‌లాల్‌కు సారథిగా వచ్చిన ఆంటోనీ పెరుంబవూర్, ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక సభ్యుడిలా మారిపోయాడు. ప్రణవ్ మోహన్‌లాల్ చిత్ర పరిశ్రమలోకి హీరోగా తెరంగేట్రం చేశారు. ‘ఆది’, ‘హృదయం’ వంటి ప్రణవ్ విజయవంతమైన చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్‏లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..

విస్మయ ఇప్పటికే రచన, చిత్రలేఖన రంగాలలో తనదైన ముద్ర వేసింది. విస్మయ కవితా సంకలనం ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ పాఠకుల నుండి మంచి ఆదరణ పొందింది. అంతేకాకుండా, థాయ్ యుద్ధ కళ అయిన ముయ్ థాయ్ పట్ల విస్మయకున్న అంకితభావాన్ని సోషల్ మీడియాలో అభిమానులు ఎంతగానో ఆదరించారు. అనేక రంగాలలో తన సృజనాత్మక ప్రతిభను నిరూపించుకున్న తర్వాత, విస్మయ ఇప్పుడు కెమెరా ముందుకు వస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Rami Reddy : తెలుగులో పవర్ ఫుల్ విలన్.. రామి రెడ్డి చనిపోవడానికి అసలు కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఏం సినిమా రా బాబూ.. పేరుకే పక్కా కామెడీ మూవీ.. కానీ 15 ఏళ్లుగా బాక్సాఫీస్ షేక్.. ఇప్పుడు ఓటీటీలో రచ్చ..

Follow Us