Tollywood : ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో.. ఎంగేజ్మెంట్ ఫోటోస్ వైరల్.. త్వరలోనే పెళ్లి వేడుక..

తెలుగు సినీరంగంలో హీరోగా, విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. కానీ ప్రధాన నటుడిగా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో సహయ నటుడిగా మెప్పించాడు. అలాగే ప్రతినాయకుడి పాత్రలలోనూ కనిపించారు. తాజాగా తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నట్లు తెలిపారు. ఇన్ స్టా వేదికగా తన ప్రియురాలిని పరిచయం చేస్తూ ఫోటోస్ షేర్ చేశారు.

Tollywood : ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో.. ఎంగేజ్మెంట్ ఫోటోస్ వైరల్.. త్వరలోనే పెళ్లి వేడుక..
Prince

Updated on: Jul 20, 2026 | 2:39 PM

తెలుగు సినీరంగంలో హీరోగా అలరించాడు ప్రిన్స్. కానీ తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో సహయ నటుడిగా, ప్రతినాయకుడిగా మెప్పించాడు. ‘బస్ స్టాప్’, ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ వంటి చిత్రాలతో యూత్ ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు. సినిమాలతో పాటు బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఈ నటుడు, త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన ఎన్నారై (NRI) అమ్మాయితో ఆయన వివాహం నిశ్చయమైంది. తాజాగా ప్రిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రత్యేకమైన వీడియోను షేర్ చేస్తూ తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ వీడియోలో ఆయన తన ప్రియురాలికి రొమాంటిక్‌గా ప్రపోజ్ చేసిన మూమెంట్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకలో టాలీవుడ్ నటుడు ప్రియదర్శి కూడా పాల్గొని సందడి చేశారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఒక కామన్ ఫ్రెండ్ వివాహ వేడుకలో వీరిద్దరికీ తొలిసారి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే మంచి స్నేహంగా, ఆ తర్వాత గాఢమైన ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించిన ఈ జంట, గత నెల ప్రారంభంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ లవ్ బర్డ్స్ ఆగస్టు 24న న్యూజిలాండ్‌లో అత్యంత వైభవంగా వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ప్రిన్స్ అభిమానులు , సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హీరోగానే కాకుండా విభిన్న క్యారెక్టర్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రిన్స్ జీవితంలో ఈ కొత్త చాప్టర్ అద్భుతంగా సాగాలని కోరుకుందాం.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

ప్రిన్స్ ఎంగేజ్మెంట్..

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

Follow Us