వివేక్ ఆత్రేయ దగ్గర ఇండియన్ సినిమాను మార్చే ‘మాస్టర్ ప్లాన్’.. హీరో శ్రీవిష్ణు కామెంట్ల వెనుక ఆంతర్యం ఏంటి?

ఆయన రాసే కథల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. అతి సాధారణంగా అనిపించే సన్నివేశాలను కూడా తన అద్భుతమైన స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తారు. ‘మెంటల్ మదిలో’ అంటూ కెరీర్ మొదలుపెట్టి, ‘బ్రోచేవారెవరురా’తో విమర్శకుల ప్రశంసలు అందుకుని, ‘సరిపోదా శనివారం’తో మాస్ ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు.

వివేక్ ఆత్రేయ దగ్గర ఇండియన్ సినిమాను మార్చే ‘మాస్టర్ ప్లాన్’.. హీరో శ్రీవిష్ణు కామెంట్ల వెనుక ఆంతర్యం ఏంటి?
Sri Vishnu & Vivek Athreya

Updated on: Mar 02, 2026 | 12:22 PM

టాలీవుడ్ కుర్ర దర్శకులు, యంగ్ హీరోలు ఇప్పుడు గేరు మార్చారు. రొటీన్ ఫార్ములా కథలకు స్వస్తి చెప్పి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. బడ్జెట్ పరిమితులు దాటి, కంటెంట్ మీద నమ్మకంతో పాన్ ఇండియా స్థాయి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఈ బాటలో ఉండగా, ఇప్పుడు ఒక యంగ్ డైరెక్టర్ రాసిన కథలు ఇండియన్ సినిమా గమనాన్ని మార్చేస్తాయని ఇండస్ట్రీలో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది.

ఆయన రాసే కథల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. అతి సాధారణంగా అనిపించే సన్నివేశాలను కూడా తన అద్భుతమైన స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తారు. ‘మెంటల్ మదిలో’ అంటూ కెరీర్ మొదలుపెట్టి, ‘బ్రోచేవారెవరురా’తో విమర్శకుల ప్రశంసలు అందుకుని, ‘సరిపోదా శనివారం’తో మాస్ ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు. అయితే, ఇవన్నీ కేవలం శాంపిల్ మాత్రమేనని, అసలైన బాంబులు ఇంకా ఆయన దగ్గరే ఉన్నాయని ఒక హీరో బాంబు పేల్చారు. ఆ డైరెక్టర్ సృష్టించబోయే విధ్వంసం ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తుందని ఆ హీరో చెబుతున్నాడు. ఆ సెన్సేషనల్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.

శ్రీవిష్ణు షాకింగ్ కామెంట్స్

వివేక్ ఆత్రేయ తొలి సినిమాల్లో హీరోగా నటించిన శ్రీవిష్ణుకు, ఆయనతో మంచి అనుబంధం ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివేక్ దగ్గర ఉన్న కథల గురించి శ్రీవిష్ణు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “వివేక్ దగ్గర రెండు, మూడు స్టోరీస్ ఉన్నాయి. అవి ఎప్పుడు తీస్తాడో తెలియదు కానీ, అవి ఇండియన్ సినిమాను సమూలంగా మార్చేసే ‘గేమ్ ఛేంజర్స్’. ఆ స్క్రిప్ట్స్, స్క్రీన్ ప్లే అంటే ఏంటో ప్రపంచానికి చూపిస్తాయి. అవి ఎవరితో చేసినా ఒక రేంజ్ లో ఉంటాయి” అని శ్రీవిష్ణు ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పుకొచ్చారు.

బ్రాండ్ వాల్యూ పెరిగితేనే..

దర్శకుడిగా వివేక్ ఆత్రేయకు ఇంకా బ్రాండ్ వాల్యూ పెరగాలని, ఆ తర్వాతే ఆ పెద్ద కథలను తెరపైకి తీసుకురావాలని వీరిద్దరూ చర్చించుకున్నారట. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ నందమూరి బాలకృష్ణతో ఒక పవర్ ఫుల్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా ఒక భారీ ప్రాజెక్ట్ చేసేందుకు వివేక్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. శ్రీవిష్ణు చెబుతున్న ఆ ‘గేమ్ ఛేంజర్’ కథలు బాలయ్య లేదా రజనీకాంత్ తోనే ఉంటాయా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

మారుతున్న ట్రెండ్..

శ్రీకాంత్ ఓదెల ‘నాని ది ప్యారడైజ్’తో ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతుండగా, వివేక్ ఆత్రేయ తన విలక్షణమైన శైలితో ఆశ్చర్యపరచబోతున్నారు. యంగ్ హీరోలు విశ్వక్ సేన్, శర్వానంద్ కూడా భారీ బడ్జెట్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో పోటీ పడుతున్నారు. ఈ కుర్ర డైరెక్టర్లు, హీరోలు గనుక తమ కంటెంట్ తో మెప్పిస్తే టాలీవుడ్ కీర్తి మరింత స్థాయికి చేరుతుంది. వివేక్ ఆత్రేయ తన పదునైన కలంతో ఎలాంటి మాయ చేస్తారో చూడాలి. శ్రీవిష్ణు చెప్పినట్లుగా ఆ కథలు ఇండియన్ సినిమా స్థాయిని పెంచితే, టాలీవుడ్ కు ఒక గొప్ప విజన్ ఉన్న దర్శకుడు దొరికినట్లే.

Follow Us