Varanasi Movie: ‘వారణాసి’ సినిమా స్టోరీని లీక్ చేసిన రాజమౌళి.. మినిమిం 3 వేల కోట్లు అంటోన్న మహేష్ ఫ్యాన్స్

దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఒక ప్రత్యేక మీడియా ఇంటరాక్షన్‌లో పాల్గొన్న జక్కన్న తన వారణాసి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో స్టోరీ లైన్ ఏంటో కూడా రివీల్ చేశారు.

Varanasi Movie: వారణాసి సినిమా స్టోరీని లీక్ చేసిన రాజమౌళి.. మినిమిం 3 వేల కోట్లు అంటోన్న మహేష్ ఫ్యాన్స్
Mahesh Babu Varanasi Movie

Updated on: Jun 28, 2026 | 10:45 AM

దర్శక ధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి దాకా ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా? అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంటర్నేషన్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరో కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న రాజమౌళి ఓ ఈవెంట్ కోసం ఫ్రాన్స్ కు వెళ్లాడు. అక్కడ ఒక ప్రత్యేక మీడియా ఇంటరాక్షన్‌లో పాల్గొన్న జక్కన్న తన వారణాసి సినిమా గురించి మాట్లాడారు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాల్లా వారణాసి సినిమాకు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ లేవన్నారు జక్కన్న. మహేష్ బాబుతో తీస్తున్న ఈ సినిమా కేవలం ఒకే ఒక స్టాండ్‌అలోన్ చిత్రంగా ఉంటుందని రాజమౌళి స్పష్టం చేశారు. ఇక ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్‌గా కనిపిస్తున్నప్పటికీ, దీని ఆత్మ మాత్రం భారతీయులకు నచ్చే ఎమోషన్ అని రాజమౌళి హైప్ పెంచారు.

‘ఆఫ్రికాలోని దట్టమైన అడవుల నుంచి అంటార్కిటికాలోని విపరీతమైన చలి వరకు, రామాయణంలోని దేవుళ్లు, ప్రకృతి విపత్తులు, అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్.. ఇలా ఇవన్నీ ఒకే సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారు. అయితే వారణాసి సినిమాకు మూలం మాత్రం తండ్రీకొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్. దాని నుంచే ఇవన్నీ వస్తాయి’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

వారణాసి సినిమా గురించి రాజమౌళి ఇచ్చిన హింట్స్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్డడం ఖాయమని, మినిమం రూ.3వేల కోట్లు రాబడుతుందని ఇప్పటికే అంచనాలు వస్తున్నారు అభిమానులు. కాగా 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా వారణాసి సినిమా విడుదల కానుంది.

మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా గురించి రాజమౌళి మాటల్లో.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us