Shekar Kammula : ఆ డైరెక్టర్ సినిమా చూసి ఇదేం సినిమా అన్నారు.. కానీ.. ఇప్పటికీ ఆ మూవీ డిమాండ్ తగ్గలేదు..

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమాలకు తెలుగు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. ఇటీవలే కుబేర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం చెప్పారో తెలుసుకుందామా.

Shekar Kammula : ఆ డైరెక్టర్ సినిమా చూసి ఇదేం సినిమా అన్నారు.. కానీ.. ఇప్పటికీ ఆ మూవీ డిమాండ్ తగ్గలేదు..
Sekhar Kammula

Updated on: May 11, 2026 | 10:43 AM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన కెరీర్‌లో ‘ఆనంద్’ సినిమా ఒక మైలురాయి. 2004లో విడుదలైన ఈ చిన్న చిత్రం అప్పట్లో ఒక సంచలనం. “మంచి కాఫీ లాంటి సినిమా” అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఈ సినిమా గురించి, అగ్ర దర్శకుడు కృష్ణవంశీ స్పందన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ‘డాలర్ డ్రీమ్స్’ తర్వాత శేఖర్ కమ్ముల చేసిన రెండో ప్రయత్నం ‘ఆనంద్’. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో, పూర్తయిన తర్వాత చాలా మందికి దీనిపై నమ్మకం ఉండేది కాదు. అసలు యాక్షన్ లేదు, భారీ డైలాగులు లేవు, కేవలం ఒక సింపుల్ ప్రేమకథతో సినిమా నడుస్తుందని చాలా మంది పెదవి విరిచారు. సినిమా పూర్తయ్యాక శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని అగ్ర దర్శకుడు కృష్ణవంశీకి చూపించారు. సినిమా చూసిన తర్వాత కృష్ణవంశీ స్పందన చాలా విచిత్రంగా ఉంది. ఆయన సినిమా చూసి బయటకు రాగానే శేఖర్ కమ్ముల వైపు చూసి, “అసలు ఇదేం సినిమా రా.. అసలు దీంట్లో ఏం ఉంది?” అని అన్నారట. అంటే ఆయన ఉద్దేశ్యంలో ఒక కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన ఏ లక్షణాలు ఇందులో లేవని, చాలా ప్లెయిన్‌గా ఉందని ఆయన భావించారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

శేఖర్ కమ్ముల తన విజన్ మీద నమ్మకంతో సినిమాను విడుదల చేశారు. చిత్రం విడుదలైన తర్వాత కృష్ణవంశీ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చడం, క్లాసిక్ హిట్‌గా నిలవడంతో ఆయన కూడా శేఖర్ కమ్ముల ప్రతిభను అభినందించారు. శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ ద్వారా ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. అప్పటి వరకు ఉన్న కమర్షియల్ ఫార్ములాను బ్రేక్ చేస్తూ, భావోద్వేగాలే ప్రధానంగా సాగే సినిమాలకు ఆదరణ ఉంటుందని నిరూపించారు. ఈ సినిమా 6 నంది అవార్డులను గెలుచుకోవడమే కాకుండా, శేఖర్ కమ్ములను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల సరసన నిలబెట్టింది. ఒక వైపు భారీ బడ్జెట్ సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, ‘ఆనంద్’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడి ఘనవిజయం సాధించడం అప్పట్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికీ శేఖర్ కమ్ముల అంటే ‘ఆనంద్’ సినిమాయే గుర్తొస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ఆనంద్ చిత్రం ఒక గొప్ప రత్నం లాంటిదని, ఎన్నో వినూత్న అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందని ఒక సందర్భంలో చర్చ జరిగింది. ఈ 3 1/2 గంటల నిడివి గల సినిమాను దర్శకుడు కృష్ణ వంశీకి చూపించినప్పుడు, ఆయన ఇంటర్వెల్ వద్దే “సినిమా అయిపోయిందా?” అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us