Prabhas Adipurush: డార్లింగ్ అభిమానుల‌కు విజువ‌ల్ ట్రీట్ ఖాయం.. ఆదిపురుష్‌లో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట‌..

|

Jun 17, 2021 | 6:09 AM

Prabhas Adipurush: ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ డైరెక్ష‌న్‌లో ఆదిపురుష్ అనే సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్ప‌టి నుంచే...

Prabhas Adipurush: డార్లింగ్ అభిమానుల‌కు విజువ‌ల్ ట్రీట్ ఖాయం.. ఆదిపురుష్‌లో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట‌..
Prabhas Adipurush
Follow us on

Prabhas Adipurush: ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ డైరెక్ష‌న్‌లో ఆదిపురుష్ అనే సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్ప‌టి నుంచే భారీ అంచ‌నాలున్నాయి. రామాయ‌ణ ఇతిహాసాన్ని ఆధారం చేస‌కొని తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్ర‌భాస్ అభిమానుల్లోనే కాకుండా ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఎదురుచూస్తోంది. అయితే ఈ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు ఓంరౌత్‌.
ముఖ్యంగా ఆదిపురుష్ సినిమాలో గ్రాఫిక్స్ వ‌ర్క్ కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. పురాణాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో స‌హ‌జంగా గ్రాఫిక్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. అయితే దీనిని మరింత విజువ‌ల్ ట్రీట్‌గా చూపించే క్ర‌మంలో ద‌ర్శ‌కుడు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 6వేల‌కు పైగా కంప్యూట‌ర్ గ్రాఫిక్ షాట్స్‌ను ఉప‌యోగిస్తున్నార‌ని టాక్‌. ఈ లెక్క‌న చూస్తే.. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఆదిపురుష్ ఓ విజువ‌ల్ ట్రీట్‌గా నిలుస్తంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌నిపిస్తోంది క‌దూ. ఇదిలా ఉంటే క‌రోనా కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డ్డా ఆదిపురుష్ త‌ర్వాతి షెడ్యూల్‌ను ఈ నెల చివ‌రిలో తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపిస్తుండ‌గా.. రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, సీత పాత్రలో కృతీ సనన్‌ కనిపించ‌నున్నారు.

Also Read: Mosagallu Movie: ఓటీటీలోకి మంచు విష్ణు ‘మోసగాళ్లు’.. ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ..

Tamannah: ‘కఠిన సమయంలో షూటింగ్ జరపడం పెద్ద సవాల్.. కానీ మేము విజయవంతంగా పూర్తి చేశాం’.. తమన్నా..

Love Story: థియేటర్లలో రోజుకు 4 షోలు ఉన్నప్పుడే ‘లవ్ స్టోరీ’ విడుదల.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..