Andrea Jeremiah: నగ్నంగా నటించిన హీరోయిన్.. తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే..

|

Aug 28, 2022 | 10:42 AM

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 31న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా నటి ఆండ్రియాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Andrea Jeremiah: నగ్నంగా నటించిన హీరోయిన్.. తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే..
Andriya
Follow us on

ఆండ్రియా జెరెమియా (Andrea Jeremiah).. సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు సుపరిచితమే. యుగానికి ఒక్కడు సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా పలు సినిమాల్లో సహయనటిగా మెప్పించింది. అయితే తెలుగులో కాకుండా తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం పిశాచి 2. ఈ సినిమాకు డైరెక్టర్ మిష్కిన్ దర్శకత్వం వహించారు. గతంలో సూపర్ హిట్ అయిన పిశాచి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని రాక్ ఫోర్ట్ బ్యానర్ పై మురుగానందం నిర్మిస్తున్నారు. ఇందులో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ మరింత ఆసక్తిగా ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 31న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా నటి ఆండ్రియాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్‏లలో నటి ఆండ్రియా పూర్తి నగ్నంగా నటించిందని.. అందుకు ఆమె భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే విషయాన్ని గతంలో డైరెక్టర్ మిష్కిన్ సైతం ఒప్పుకునా్నారట. అందుకు ఆమె భారీగా పారితోషికం తీసుకుందని తెలిపారు. అయితే సినిమాలు ఆమె నగ్నంగా నటించే సన్నివేశాలు లేవని.. కేవలం పోస్టర్స్ కోసం మాత్రమే తీసుకున్నట్లు తెలిపారు. ఆమె సన్నిహితురాలు అయిన ఫోటోగ్రాఫర్ తోనే ఫోటోస్ తీయించామని…. పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం చూడడం కోసం ఎలాంటి బోల్డ్ సన్నివేశాలు, నగ్న ఫోటోస్ పొందుపరచలేదని తెలిపారు. ఆ ఫోటోలు జతచేస్తే సెన్సార్ పోర్డు ఏ సర్టిఫికేట్ ఇస్తుందని భావించి చేర్చలేదని తెలిపారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజా సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం విరామం తర్వాత పిశాచి 2 సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు కార్తీక్ రాజా.