
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన కెరీర్, దివంగత నటి సిల్క్ స్మితతో తన అనుబంధం, చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేకమైన పని విధానం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కృష్ణవంశీ తన కెరీర్ ప్రారంభంలో సిల్క్ స్మిత గారి నుంచి తన మొదటి రెమ్యునరేషన్‌గా రూ.500 అందుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అది ఆయనకు ఎంతో ప్రత్యేకమని, ఆమె మంచితనానికి నిదర్శనమని చెప్పారు. గులాబి సినిమా డైరెక్టర్ అయిన తర్వాత, అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద సిల్క్ స్మితతో అనుకోకుండా తన భేటీని వివరించారు. స్మిత కారులో వచ్చి ఆగి, గ్లాస్ దించి, “ఏంటి అలా చూస్తున్నావ్ రా ఇటు? నన్ను గుర్తుపట్టలేదా నువ్వు?” అని అడిగిన తీరు ఆయనకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు ఆమె తన సినిమాను మెచ్చుకుంటూ అభినందించారని తెలిపారు. సిల్క్ స్మిత చాలా దయాగుణం ఉన్న మనిషి అని, ఆమె డ్రైవర్లను, మేకప్ మ్యాన్‌లను, అలాగే జూనియర్ ఆర్టిస్టులను చూసుకునే విధానం అద్భుతమని కృష్ణవంశీ కొనియాడారు. ఆమె ముక్కుసూటిగా, ఓపెన్‌గా ఉండే వ్యక్తి అని, ఇతరులు తన గురించి ఏమనుకుంటారో అనే విషయాలను పెద్దగా పట్టించుకునేది కాదని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..
దర్శకుడిగా కృష్ణవంశీ పని విధానం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరేటప్పుడు, శివనాగేశ్వరరావు గారి దగ్గర ఏడు సినిమాలు చేశానని అబద్ధం చెప్పినట్లు ఆయన ఒప్పుకున్నారు. అయితే, వర్మ పని పట్ల నిబద్ధతను మాత్రమే చూస్తారని, అబద్ధాలను పట్టించుకోరని ఆయన చెప్పారు. సెట్లో “గుడ్ మార్నింగ్” చెప్పడం పట్ల ఆయనకున్న అభ్యంతరాన్ని వెల్లడించారు. ఒక డైరెక్టర్ రాత్రి నుంచి మరుసటి రోజు సీన్‌పై తీవ్రమైన ఏకాగ్రతతో ఉంటాడని, ఉదయం సెట్‌కు వెళ్లినప్పుడు వందల మంది “గుడ్ మార్నింగ్” చెబితే ఆ ఏకాగ్రత దెబ్బతింటుందని ఆయన వివరించారు. అందుకే ఎవరికీ “గుడ్ మార్నింగ్” చెప్పొద్దని, వెళ్లేటప్పుడు నవ్వుతూ బై చెప్పాలని తన అసిస్టెంట్ డైరెక్టర్లకు చెబుతానని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..
కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్లకు ప్రత్యేకమైన స్వేచ్ఛ ఏమీ ఉండదని, సెట్లో అందరూ సమానమేనని స్పష్టం చేశారు. అయితే, పని పట్ల కమిట్‌మెంట్ లేకపోతే మాత్రం మందలిస్తానని చెప్పారు. దర్శకుడికి ఒక కమాండ్ ఉండాలంటే, ముందుగా అతనికి పూర్తి నిబద్ధత ఉండాలని ఆయన నమ్ముతారు. కొత్త అసిస్టెంట్ డైరెక్టర్లను ఎంపిక చేసేటప్పుడు వారికి ఇష్టమైన సినిమా ఏంటి, అది ఎందుకు నచ్చింది, అందులో ఏ అంశాలను చూశారో అడిగి వారి సినిమా అవగాహనను పరీక్షిస్తానని తెలిపారు. గ్యాంగ్ లీడర్, దూకుడు, పోకిరి, బాహుబలి వంటి కమర్షియల్ సినిమాల గురించి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా, వారు సినిమాను ఎలా చూస్తున్నారో అర్థమవుతుందని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..