చాలా మంది నటీమణులు హీరోయిన్స్ గా రాణించక ముందు కొందరు పలు యాడ్స్ లో నటించి మెప్పించారు. చాలా మంది చిన్న చిన్న పాత్రలు, జూనియర్ ఆర్టిస్ట్ లుగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా చాలా మంది పలు యాడ్స్ లో నటించి ఆకట్టుకున్నారు. అలాగే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఓ హీరోయిన్ కూడా యాడ్ లో నటించి ఆతర్వాత క్రేజ్ తెచ్చుకొని.. ఇప్పుడు హీరోయిన్ గా మారి వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే ఆమె ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. వాణిజ్య ప్రకటనల్లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న యాడ్ సంతూర్. ఇప్పటికీ ఈ యాడ్ చాలా పాపులర్. ఎవరైనా పెళ్లైన మహిళలు అందంగా ఉంటే సంతూర్ మమ్మీ అని అంటుంటారు. అలాగే ఇప్పుడు సంతూర్ లో నటించిన ఓ చిన్నది ఇప్పుడు క్రేజీ హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
సంతూర్ యాడ్ లో నటించిన ఆ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆమె ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ. ఆమె ఎవరంటే యానిమల్ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వయ్యారి భామ తృప్తి దిమ్రి. యానిమల్ సినిమాలో బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది ఈ చిన్నది. యానిమల్ సినిమా తర్వాత తృప్తి దిమ్రి చాలా క్రేజ్ తెచ్చుకుంది. అలాగే యానిమల్ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తోంది తృప్తి దిమ్రి.
కెరీర్ బిగినింగ్లో తృప్తి దిమ్రి పలు యాడ్స్ లో నటించింది. అలాగే సంతూర్ యాడ్ లోనూ నటించింది తృప్తి దిమ్రి. 2017లో కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ సినిమాతో తొలిసారిగా నటించింది తృప్తి దిమ్రి. లైలా మజ్ను సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఆతర్వాత వరుసగా బుల్బుల్ , కళ సినిమాల్లో చేసింది. యానిమల్ సినిమాలో నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే తన సినిమా అప్డేట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.