Ravi Babu: ఆరేళ్ల వయసులోనే అమ్మప్రేమకు దూరం.. రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం కళ్ల ముందే..

ఇటీవలే రేజర్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు రవిబాబు. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ డీసెంట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరైన రవి బాబు తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Ravi Babu: ఆరేళ్ల వయసులోనే అమ్మప్రేమకు దూరం.. రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం కళ్ల ముందే..
Ravi Babu Mother

Updated on: May 21, 2026 | 7:42 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో రవి బాబు ఒకరు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, రైటర్ గా, డైరెక్టర్ గా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్నారాయన . ప్రముఖ సీనియర్ నటుడు, విలన్ చలపతి రావు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రవి బాబు అతి తక్కువ కాలంలోనే తన ట్యాలెంట్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే అల్లరి సినిమాతో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాతన నచ్చావులే, అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ, అనసూయ, అమరావతి, మనసారా, నువ్విలా, అవను, అవును2, క్రష్, ఏనుగు తొండం ఘటికాచలం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించాడు రవి బాబు. రీసెంట్ గా రేజర్ అంటూ ఓ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మే 08న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు రవి బాబు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే తన తల్లి ఎలా చనిపోయారో చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యారు.

‘మా అమ్మ చనిపోయినప్పుడు నా వయసు ఆరేళ్లు ఉంటాయనుకుంటా. ఆ రోజు మా ఫాదర్ (చలపతి రావు) షూటింగ్ కు వెళ్లి బాగా అలసిపోయి ఇంటికి వచ్చారు. చెవిలో నొప్పిగా ఉందని ఇయర్ డ్రాప్స్ వేసుకుని రెండు చెవుల్లో కాటన్ పెట్టుకుని నిద్ర పోయారు. మేం కూడా చిన్నపిల్లలం కదా.. ఆయన పక్కనే నిద్రపోయాం. మరుసటి రోజు తెల్లవారుజామునే నీళ్లు పట్టడానికి మా అమ్మ నిద్ర లేచింది. అప్పుడే టీ చేసేందుకు గ్యాస్ స్టవ్ ఆన్ చేసింది. అ సమయంలో మా అమ్మ ధరించిన నైలాన్ షారీ పమిట ప్రమాదవశాత్తూ మంటకు తగిలింది.. కానీ ఆమె చూసుకోలేదు. సడెన్ గా చూస్తే ఒళ్లంతా మంటలు. నైలాన్ షారీ కదా ఫాస్ట్ గా మంటలు శరీరమంతా వ్యాపించాయి. అందరం లేచి వెళ్లి చూసే సరికి అమ్మ మంటల్లో కాలిపోతోంది. అదే సమయంలో అక్కడున్న నీళ్లను ఆమె మీద పోశాం. నిజం చెప్పాలంటే.. నీళ్లు పోయకూడదు. కానీ అలా చేయాల్సి వచ్చింది’ అని అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు రవి బాబు.

కాగా ఈ ఫైర్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాల పాలైన రవి బాబు తల్లి మూడు రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. భార్య చనిపోయిన తర్వాత చలపతి రావు మళ్లీ రెండో పెళ్లి చేసుకోలేదు. చాలా మంది ఈ విషయంపై ఆయనను బలవంత పెట్టినా పిల్లల కోసం రెండో పెళ్లి మాట ఎత్తలేదంట.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us