
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. ఈ అందాల భామలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజే వేరు. స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది సాయి పల్లవి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. స్కిన్ షోకు దూరంగా ఉంటూ ప్రేక్షకుల మనసులను దోచేసింది సాయి పల్లవి. ఇప్పుడున్న హీరోయిన్స్ అందరూ గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్నారు.. కానీ సాయి పల్లవి అలాంటి వాటి జోలికి పోకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కుర్రాలందరూ సాయి పల్లవి లాంటి లవర్ మనకు ఉండాలని అనుకుంటుంటారు. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఫస్ట్ మూవీతోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
అంతకు ముందు పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించింది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది సాయి పల్లవి. తెలుగులో చివరగా తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ.. ఇప్పుడు హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఇందులో రణభీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా.. సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది.
ఇదిలా ఉంటే సాయి పల్లవి ఓ క్రేజీ సినిమా ఆఫర్ ను మిస్ చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా ఎదో కాదు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్. విజయ్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చాలా మంది ఫేవరెట్ మూవీ. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఉండటంతో సాయి పల్లవి నో చెప్పిందని దాంతో ఆ ఆఫర్ రశ్మికకు వచ్చిందని ప్రచారం జరిగితుంది. ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. సాధారణంగా రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ లాంటి వాటికి సాయి పల్లవి దూరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి