Kalki 2898 AD: ప్రభాస్ కల్కిలో దిశా పటానీ రోల్‌ను ఆ స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుందా..?

ఊహించని విధంగా కలెక్షన్ సొంతం చేసుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది కల్కి సినిమా ఇప్పటికే ఈ సినిమా 700 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమాలో చాలా మంది సూపర్ స్థార్స్ నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కిలో దిశా పటానీ రోల్‌ను ఆ స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుందా..?
Kalki 2898 Ad
Follow us

|

Updated on: Jul 05, 2024 | 1:27 PM

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా దూసుకుపోతుంది. ఎక్కడ చూసిన కల్కి సినిమా రికార్డుల మోతమోగిస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఊహించని విధంగా కలెక్షన్ సొంతం చేసుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది కల్కి సినిమా ఇప్పటికే ఈ సినిమా 700 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమాలో చాలా మంది సూపర్ స్థార్స్ నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో అందాల భామలు దీపికా పదుకొనె , దిశా పటాని హీరోయిన్స్ గా చేశారు. ఇదిలా ఉంటే కల్కి సినిమాలో దిశా పటాని పాత్ర కోసం ముందుకు మరో హీరోయిన్ ను అనుకున్నారని టాక్ వినిపిస్తుంది..

సినిమాలో ఎలాగో ఒక హీరోయిన్ బాలీవుడ్ నుంచి ఉంది కాబట్టి రెండో హీరోయిన్ ను టాలీవుడ్ నుంచి తీసుకోవాలనుకున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే దిశా ప్లేస్ లో ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. ఇప్పుడు సోషల్ మీడియాలో .. ఫిలిం సర్కిల్స్ లో ఇదే గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ రష్మికాను సంప్రదించినప్పుడు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమా ఛాన్స్ మిస్ చేసుకుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇప్పటికే రష్మిక చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లో ఓ సినిమా బాలీవుడ్ లో ఓ రెండు సినిమాలు చేస్తుంది. అయితే ప్రభాస్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకునేంత అమాయకురాలు కాదు రష్మిక. కల్కి సినిమాలో ఆమె ఛాన్స్ మిస్ చేసుకుందని వస్తున్న వార్త పూర్తిగా రూమర్స్ మమాత్రమే అని తెలుస్తోంది. గతంలోనూ రష్మిక సీతారామం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. పైగా దిశా పటాని సినిమాలో కనిపించేది తక్కువ సేపే కాబట్టి పెద్దగా డేట్స్ కూడా అవసరం ఉండవు.. దాంతో ఇవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే అని తెలుస్తోంది. ఇక కల్కి విషయానికొస్తే ఈ సినిమాలో చాలా మంది నటించారు. దుల్కర్ సల్మాన్, శోభన, మృణాల్ ఠాకూర్, రాజేంద్రప్రసాద్, అవసరాల శ్రీనివాస్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఇలా చాలా మంది కనిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!