శ్రీలీల.. మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ. ఇప్పుడు కుర్రాళ్లందరూ తన పేరునే కలవరిస్తున్నారు. శ్రీలీల లాంటి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంటే చాలు అని చాలామంది బాయ్స్ అనుకుంటున్నారు. ఆ రేంజ్ బ్యూటీ ఆమెది. ఆమె ఏజ్ జస్ట్ 21.. కానీ ఆమె ఫ్యాన్ బేస్ మాత్రం 1.2 మిలియన్. కన్నడలో 2 సినిమాల్లో నటించిన శ్రీ.. పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. రెండో మూవీకే మాస్ మహరాజ్ రవితేజ సరసన ధమాకాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రజెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. రియాలిటీ ఏంటంటే.. ధమాకా విడుదలకు ముందే ఆమె ఆరడజను సినిమాలను ఓకే చేసింది.
ప్రజంట్ రామ్, బోయపాటి సినిమాలో నటిస్తోంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తోనూ ఓ సినిమాకి ఓకే చెప్పింది శ్రీలీల. హీరో నితిన్, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టిలతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి కాపౌండ్లోనూ ఓ మూవీకి సైన్ చేసింది. మరో 2, 3 సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నాయి. ఆమె ధమాకా చిత్రానికి 40 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్. ప్రజంట్ ఒప్పుకున్న సినిమాలను 1 కోటికి ఓకే చేసిందట. అయితే వెంటనే డేట్స్ అడ్జెస్ట్ చేస్తే.. రూ. 1.5 కోట్లు ఇస్తానని ఓ నిర్మాత ఆఫర్ ఇచ్చాడట. అది ఆమె ప్రజంట్ డిమాండ్.
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలా మంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు. కానీ తాను మాత్రం MBBS చదువుతూనే మూవీస్ చేస్తున్నాను అని చెప్తోంది శ్రీ. చదువు – సినిమా రెండిటినీ బ్యాలెన్స్ చేయడం అలవాటైపోయిందని వివరించింది. ఇంత బిజీ షెడ్యూల్స్‌లో ఆమె స్టడీస్‌కు కూడా టైమ్ కేటాయించడం విశేషం.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.