Uppena Movie : అందమైన ఆ ప్రేమ కథకు నేను ఫిదా అయిపోయా.. ‘ఉప్పెన’ సినిమాపై దేవీశ్రీ ప్రసాద్..

మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో వైష్ణవ్ తేజ్ ఈ యంగ్ హీరో నటించిన ఉప్పెన సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్...

Uppena Movie : అందమైన ఆ ప్రేమ కథకు నేను ఫిదా అయిపోయా.. ఉప్పెన సినిమాపై దేవీశ్రీ ప్రసాద్..

Updated on: Feb 06, 2021 | 4:39 PM

Uppena Movie :మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో వైష్ణవ్ తేజ్ ఈ యంగ్ హీరో నటించిన ‘ఉప్పెన’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని వై.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది.ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఈ అందమైన ప్రేమ కావ్యానికి మరింత అందంగా దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు.  పాటలన్ని యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నీకన్న నీలి సముద్రం పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమాగురించి దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “దర్శకుడు బుచ్చిబాబు గురువు సుకుమార్ కు తగిన శిష్యుడు. అతని ఆలోచనా విధానం.. సుక్కూ మాదిరిగానే ఇతరులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సుక్కూ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నపటి నుంచి బుచ్చి నాకు తెలుసు. ఆయన ఉప్పెన కథ విన్న తర్వాత నేను ఫిదా అయ్యాను.” అంటూ చెప్పుకొచ్చాడు దేవీశ్రీ.ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి..

‘Chaavu Kaburu Challaga’ Movie : ప్రేక్షకుల ముందుకు బ‌స్తీ బాలారాజు ఇంట్రో సాంగ్.. ‘మై నేమ్ ఈజ్ రాజు’ అంటున్న కార్తికేయ..

Khiladi Movie : ‘ఖిలాడి’లో స్పెషల్ అట్రాక్షన్ గా యాక్షన్ సీక్వెన్స్.. ఐదుగురు విలన్స్ తో మాస్ రాజా పోరాటం..

Loading...
Unable to load recommendations.
Follow Us