
తెలుగులో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం కోర్ట్. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రంలో రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. అలాగే ప్రియదర్శి పులికొండ కీలక పాత్రలో మెప్పించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఇప్పుడు కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. రంజన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్, నటి దేవయాని వారసురాలు ప్రియాంక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా దేవయానినే వెల్లడించింది. సోమవారం (ఏప్రిల్ 04) రంజన్ మూవీ లాంఛ్‌కు హాజరైన దేవయాని తన కూతురికి అవకాశమిచ్చిన త్యాగరాజన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తన లాగే తన కూతురు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తుందని దేవయాని ధీమా వ్యక్తం చేసింది.
కాగా దేవయాని విషయానికి స్తే..తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది ముఖ్యంగా తెలుగులో ఆమె పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన సుస్వాగతం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత కూడా పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. శ్రీమతి వెళ్లొస్తా, మాణిక్యం, చెన్నకేశవ రెడ్డి, నాని, ఆయనే మా ఆయన, జనతా గ్యారేజ్, లవ్ స్టోరీ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది దేవయాని.
ఇక దేవయాని భర్త కూడా సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. అజిత్, పార్తీబన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఆయన ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నాడు. ఇక దేవయాని- రాజ్ కుమార్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. వీరిలో ఇనియకు ఇప్పటికే సింగర్ గా మంచి గుర్తింపు ఉంది. జీ సరిగమప వంటి సింగింగ్ రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ఇక ఇప్పుడు చిన్న కూతురు ఏకంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో దేవయాని ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
టాలీవుడ్ ఎంట్రీకి దేవయాని కుమార్తె సిద్ధం..!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ దేవయాని వారసురాలు ప్రియాంక త్వరలోనే వెండితెరకు పరిచయం కానున్నారు. త్యాగరాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంజన్’ (కోర్టు రీమేక్) సినిమాతో ఆమె సినీ రంగప్రవేశం చేస్తున్నట్లు దేవయాని అధికారికంగా ప్రకటించారు. తన… pic.twitter.com/9HGfxSixMP
— ChotaNews App (@ChotaNewsApp) April 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.