దేశమంతా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బొజ్జ గణపయ్యలను మండపాల్లో కూర్చోబెట్టి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా గణేశ్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్ దంపతులు ముంబైలోని ప్రసిద్ధమైన సిద్ధి వినాయక మందిరాన్ని దర్శించుకున్నారు. వినాయక చవితి కి ఒక రోజు ముందే ఆలయానికి వచ్చిన దంపతులు గణేశుడిని దర్శించుకున్న అనంతరం ఎరుపు రంగు దారాన్ని తమ చేతికి కట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. కాగా మరికొన్ని రోజుల్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు దీపికా, రణ్ వీర్ సింగ్. ప్రస్తుతం దీపిక నిండు గర్భంతో ఉంది. ఈ నెలలోనే ఆమెకు డెలివరీ డేట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందుగానే వినాయకుడి దీవెనలు అందుకున్నారీ లవ్లీ కపుల్.
కాగా 2018లో దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్ వివాహంతో ఒక్కటయ్యారు. తమ ప్రేమ, పెళ్లి బంధాలకు ప్రతీకగా ఈ ఏడాది ఫిబ్రవరిలోతాను గర్భం ధరించినట్లు ప్రకటించింది దీపిక. అంతే కాదు ఈ సెప్టెంబర్ లోనే తమ జీవితంలోకి బిడ్డను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అయితే మొదట ప్రసవం కోసం దీపిక లండన్‌కు వెళ్లనున్నారని వార్తలొచ్చాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. దక్షిణ ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే ఆమె డెలివరీకి అన్ని ఏర్పాట్లు జరగనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 28న దీపికా పదుకొణె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దీపిక కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండనుంది.
[Pics] Deepika Padukone and Ranveer Singh spotted at Siddhivinayak Temple pic.twitter.com/8i7D3zUSCZ
— Deepika Padukone FC (@DeepikaPFC) September 6, 2024
[Pics-2] Deepika Padukone and Ranveer Singh spotted at Siddhivinayak Temple pic.twitter.com/5SjCElkl6Y
— Deepika Padukone FC (@DeepikaPFC) September 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.