రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై స్పందించిన డేవిడ్ వార్నర్.. ఇలాంటివి ఎన్నో చూశాను అంటూ

|

Mar 25, 2025 | 1:37 PM

ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ సినిమా తర్వాత మరోసారి జత కట్టారు నితిన్, శ్రీలీల. వీరిద్దరూ హీరో, హీరోయిన్లు గా నటించిన చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమాను ‘పుష్ప2’ ఫేమ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, సాంగ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై స్పందించిన డేవిడ్ వార్నర్.. ఇలాంటివి ఎన్నో చూశాను అంటూ
Rajendra Prasad, David Warn
Follow us on

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ వార్నర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి, “రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప డైలాగులు వేస్తావా, దొంగ ము** కొడకా, నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నరూ” అంటూ సరదాగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వార్నర్ అభిమానులు తీవ్రంగా స్పందించారు.

ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది

కొందరు ఈ వ్యాఖ్యలను హాస్యంగా తీసుకోగా, మరికొందరు రాజేంద్ర ప్రసాద్ మాటలను అనుచితంగా భావించి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ క్రికెటర్ ను ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అవుతున్నారు. వార్నర్ చాలా మంచి వ్యక్తి అని అతన్ని ఇలా సినిమా పేరుతో అవమానించడం సరికాదు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. కాగా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను వార్నర్ సీరియస్ గా తీసుకోలేదని దర్శకుడు వెంకీ కుడుముల తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే

ఈ సందర్భంలో దర్శకుడు వెంకీ కుడుముల వివరణ ఇస్తూ, రాజేంద్ర ప్రసాద్ ఈ మాటలను ఫన్ టోన్‌లోనే చెప్పారని, ఈవెంట్ తర్వాత వార్నర్‌తో మాట్లాడినప్పుడు అతను దీన్ని స్పోర్టివ్‌గా తీసుకున్నాడని చెప్పారు. వార్నర్ క్రికెట్‌లో స్లెడ్జింగ్‌కు అలవాటు పడిన వ్యక్తి కాబట్టి ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదని వెంకీ స్పష్టం చేశారు. ఆయన ఒక పెద్దవారు సరదాగా మాట్లాడారు నేను ఏం బాధపడటం లేదు అని వార్నర్ అన్నారని వెంకీ తెలిపారు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.