Jani Master: మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.. జానీ మాస్టర్

సర్వసభ్య సమావేశంలో వచ్చిన మెజార్టీ అభిప్రాయంతోనే ముందుకు వెళ్తున్నాం. ఏక పక్ష నిర్ణయం ఎక్కడా తీసుకోలేదని అన్నారు టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత. డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి 18 లక్షలు విరాళంగా ఇచ్చారు జానీ మాస్టర్. TFDDDA 35 ఏళ్ల చరిత్ర ఉంది.. ఎన్నో ఏళ్లుగా చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు కూడా జరుగుతున్నాయి.. ఎవరు తప్పు చేసినా ప్రెసిడెంట్ మీదికే వస్తుంది.. ప్రెసిడెంట్‌గా మీరేం చేసారు.. మీరెందుకు క్వశ్చన్ చేయలేదు అని అడుగుతున్నారు అని అన్నారు సుమలత.

Jani Master: మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.. జానీ మాస్టర్
Jani Master

Updated on: Jul 13, 2026 | 6:38 PM

తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం రసాభాసాగా మారింది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్‌కి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటూ వార్తలు వ్యాపించాయి. ఇక ఈ మేరకు జానీ మాస్టర్, టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత వివరణ ఇచ్చేందుకు సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జానీ మాస్టర్ మాట్లాడుతూ .. “సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అని చర్చించుకునేందుకు మేం అందరం వచ్చాం. మా బాడీలో కొన్ని విషయాల మీద చర్చించుకున్నాం. కొన్ని వీడియోలు పట్టుకుని నాకు, శేఖర్ మాస్టర్‌కి గొడవ జరిగిందంటూ ప్రచారాలు చేశారు. అవన్నీ ఫేక్. శేఖర్ మాస్టర్, బాను మాస్టర్ ఇలా అందరూ మంచి వ్యక్తులు. ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులం కాదు. అందరికి అందరం సపోర్ట్‌గా ఉంటాం. ఈ వీడియోలు చూసి చిరంజీవి గారు కూడా షూటింగ్‌లో మాతో మాట్లాడారు. శేఖర్ మాస్టర్ గారు, నేను, చిరంజీవి గారు కలిసి ఆనందంగా మాట్లాడుకున్నాం. కలిసి భోజనం చేశాం. మాలో ఎలాంటి గొడవలు లేవు. మాకు చిరంజీవి గారు, హీరోలందరూ సపోర్ట్ చేస్తుంటారు. టాలెంట్ ఉన్నవారిని మా హీరోలు ఎంకరేజ్ చేస్తారు.

ఈ సందర్భంగా చిరంజీవి గారికి థాంక్స్ చెబుతున్నాం. మేమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన డ్యాన్స్, ఆయన సినిమాలు, ఫైట్స్ చూసే ఇక్కడకు వచ్చాం. మనకు డ్యాన్స్ అంటే చిరంజీవి గారే. శేఖర్ మాస్టర్ గారు, నాకు, ఇతర మాస్టర్‌లకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు.. ఒక ఇంట్లో తమ్ముడు గట్టిగా మాట్లాడతాడు.. అన్న మెల్లిగా మాట్లాడతాడు.. అంతే. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరం కలిసే ఉంటాం. జానీ మాస్టర్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు.. ఏం చేయడం లేదు అని మాటలు అన్నారు. నేను ఈ మధ్య ఎక్కువగా ‘పెద్ది’ సినిమాకే పని చేశాం. మిగతా ఏ పాటలు కూడా చేయలేదు. మన డ్యాన్సర్స్‌ల కష్టాలు, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్ సార్ గారు మాకు నలభై లక్షలు ఇచ్చారు. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలంటే 58 లక్షల ఖర్చు అవుతుంది. మిగతా 18 లక్షల గురించి చాలా మంది మాస్టర్‌లను అడిగాను. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అలా అని నేను వారిని తప్పు పట్టను. మొన్నే నాకు ‘పెద్ది’ టీం నుంచి పేమెంట్ వచ్చింది. నాకు వచ్చిన 18 లక్షల చెక్ పేమెంట్‌‌లోంచి ఒక్క రూపాయి తీసుకోకుండా అంతా కూడా డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఇస్తున్నా”అని అన్నారు.

టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ .. ‘‘టీఎఫ్‌టీడీడీఏ లాంటి పెద్ద సంస్థను నడిపించడం అంటే చిన్న విషయం కాదు. ఏ చిన్న తప్పు జరిగినా అధ్యక్షురాలిగా నా మీదకే వస్తుంది. గత బాడీలో చాలా వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయి. వాటిని ప్రశ్నించినందుకు మాకు సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. జోసెఫ్ మాస్టర్ ఓడినప్పటి నుంచి మా మీద వ్యతిరేకత మొదలైంది. ఏ పని చేసినా ప్రతీ దాంట్లో తప్పులు వెతకాలని చూస్తున్నారు. మేం ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఫెడరేషన్‌కి వ్యతిరేకంగా ఎన్నికలు జరపడం లేదు. అన్నీ కూడా లీగల్‌గానే చేస్తున్నాం. మీడియా మాత్రం థంబ్ నెయిల్స్ కాస్త చూసి పెట్టాలని కోరుతున్నాను. కొంత మంది ఇన్ ఛార్జీలు నిర్మాతల వద్ద ఎక్కువగా తీసుకుని, డ్యాన్సర్‌లకు మాత్రం తక్కువ ఇస్తున్నారు. ఇది నిజం. ఇది బయట పెట్టినప్పటి నుంచి మా మీద వ్యతిరేకత వచ్చింది. ఈ విషయం ఫెడరేషన్‌కి తెలిసినా మౌనం వహిస్తోంది. అలా మేం మా మాజీ జనరల్ సెక్రటరీని ప్రశ్నించినప్పటి నుంచీ మాకు సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. మేం అన్ని ఆధారాలతో సహా బయట పెట్టి సస్పెండ్ చేసిన తరువాత వారు రాజీనామా చేశారు. ఈసీ మెంబర్లు 8 మంది రాజీనామా చేసి ఆ తర్వాత చేయనట్టుగా మాట్లాడారు. జనరల్ సెక్రటరీ, క్యాషియర్, 8 మంది ఈసీ మెంబర్లే నిన్న గొడవ పడ్డారు. వీరి తప్పులకు టోటల్ బాడీని ఎందుకు రద్దు చేయాలి అనేది నా ప్రశ్న. డ్యాన్సర్ డబ్బులు తింటే ఎలా అని మేం అడిగాం. వారంతా రాజీనామా చేశారు.. కచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందే అని మిగతా మెంబర్స్ అన్నారు.

జనరల్ బాడీ మీటింగ్‌కి వచ్చిన 188 మెంబర్లలో 136కి పైగా మెంబర్స్ ఆమోదించారు. బై ఎలక్షన్స్‌కి వెళ్లాలని నిర్ణయించారు. ఈ జనరల్ బాడీ మీటింగ్‌ని కూడా ఫెడరేషన్ ఒప్పుకోవడం లేదు. మొత్తం బాడీని రద్దు చేసి ఎన్నికలు పెట్టాలని వాళ్లు అంటున్నారు. వాళ్లు చేసిన తప్పుకి మేం ఎందుకు రద్దు చేయాలి. అలా రద్దు చేయాలనే నియమం ఎక్కడా లేదు. మేమే వారిని తీసేశాం అని, బాయ్ కాట్ చేశామని గొడవ చేశారు. రాజీనామా చేసిన వారి స్థానాలకు ఉప ఎన్నికలు జరగాలా.? లేదా? అన్న ఈ విషయం కోసమే మా సీక్రెట్ ఓటింగ్ జరిగింది. ఎన్నికలు జరగాలా? వద్దా? అన్న దానిపై ఓటింగ్ జరిగితే.. ఎన్నికలు జరిగాయ్ అని బయటకు ప్రచారం చేశారు. మాకు ఫెడరేషన్ సహకారం కావాలి. వారి సహకారంతోనే మేం ముందుకు వెళ్తాం. ఫెడరేషన్ రూల్స్ పాటిస్తూ లీగల్‌గానే ముందుకు సాగుతాం. ఉప ఎన్నికలు కావాలనే మెజార్టీ ఓటింగ్ వచ్చింది. ఫెడరేషన్‌కి వ్యతిరేకంగా వెళ్లాలనే ఉద్దేశం మాకు లేదు. సర్వసభ్య సమావేశంలో వచ్చిన మెజార్టీ అభిప్రాయంతోనే ముందుకు వెళ్తున్నాం. ఏక పక్ష నిర్ణయం ఎక్కడా తీసుకోలేదు. ’ అని అన్నారు.

Follow Us