Suriya Sivakumar : సూర్య ‘ఈటి’ మూవీ నుంచి తెలుగు సాంగ్ వచ్చేసింది.. అదరగొడుతున్న పాట

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన నటించిన చివరి రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Suriya Sivakumar : సూర్య ఈటి మూవీ నుంచి తెలుగు సాంగ్ వచ్చేసింది.. అదరగొడుతున్న పాట
Suriya -Priyankaarulmohan

Updated on: Feb 16, 2022 | 4:28 PM

Suriya Sivakumar : తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన నటించిన చివరి రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సుధకొంగరు దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా సినిమా ఓటీటీ వేదికగా విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల విజయం తో సూర్య తిరిగిఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో.. ఆయన ఈటి అనే సినిమా చేస్తున్నారు. . పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ లో ‘ఇతరుక్కుమ్ తునింధవన్’ అనే టైటిల్ తో తెరకెక్కింది. తెలుగులో ఈటి అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు మలయాళ.. కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెప్తున్నారు సూర్య. చాలా కాలం తర్వాత సూర్య తన వాయిస్ ను వినిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ను పూర్తి చేశారు సూర్య. తాజాగా ఈ సినిమానుంచి తెలుగు పాట “సిలుకు జుబ్బా స్మార్టు .. పెట్టేశావే స్పాటు .. ” అనే పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పాటకి వనమాలి సాహిత్యాన్ని అందించగా, హరిచరణ్ – శ్రీనిధి ఆలపించారు. ఈ మూవీలో ఈ సినిమాలో సత్యరాజ్.. శరణ్య .. రాజ్ కిరణ్.. సూరి ముఖ్యమైన పాత్రలను పోషించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Movies In OTT: రొమాంటిక్, సస్పెన్స్, కామెడీ సినిమాలు ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్నాయి.. వివరాల్లోకి వెళ్తే..

DJ Tillu Box Office Collections: కలెక్షన్స్‌తో మైండ్ బ్లాంక్ చేస్తున్న డీజే టిల్లు.. ట్రేడ్ నిపుణులు సైతం షాక్

Anasuya Bharadwaj: ఏమి అందం బాబోయ్… కుర్రకారుకి చెమటలు పట్టిస్తున్న అనసూయ లేటెస్ట్ ఫోటోస్ వైరల్