Tollywood: ‘నా చావుకు కారణం ఆ టాలీవుడ్ హీరోనే’..యువకుడి సూసైడ్‌ లెటర్‌ వైరల్‌.. ఏం జరిగిందంటే?

భారీ మొత్తంలో నగదు తీసుకొని, తిరిగి ఇవ్వకుండా ఓ టాలీవుడ్ హీరో తనను వేధిస్తున్నాడంటూ చిత్తూరు జిల్లా పూతల పట్టుకు చెందిన లోకేష్‌ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు కారణం ఆ హీరోనే అంటూ ఆ యువకుడు రాసిన సూసైడ్‌ లెటర్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది.

Tollywood: నా చావుకు కారణం ఆ టాలీవుడ్ హీరోనే..యువకుడి సూసైడ్‌ లెటర్‌ వైరల్‌.. ఏం జరిగిందంటే?
Chittoor Young Man Attempts Suicide

Updated on: Mar 29, 2026 | 1:09 PM

‘జెట్టి’ సినిమా ఫేమ్, టాలీవుడ్ యంగ్ హీరో మాన్యం మురళీ కృష్ణ తనను మోసం చేశాడంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం శేషాపురం గ్రామానికి చెందిన లోకేష్ అనే యువ‌కుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన బంధువుల ద్వారా హీరోకు రూ. 3.15 కోట్లు ఇప్పించానని, ఇప్పుడు డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ లోకేశ్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన లోకేష్ ను చిత్తూరులోని బంగారుపాళ్యం ప్ర‌భుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే లోకేశ్ రాసిన సూసైడ్ లెటర్, అలాగే ఆస్పత్రి కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సూసైడ్‌ లెటర్‌లో ఏముందంటే?

కాగా సూసైడ్ నోట్ లో తనకు జరిగిన అన్యాయం గురించి లోకేష్‌ ఇలా రాసుకొచ్చాడు. ‘నాకు ఇలాంటి దీన పరిస్థితి వస్తుందని కలలో అనుకోలేదు. మా అమ్మనాన్నలను, భార్యబిడ్డలను ఈ స్థాయికి తీసుకోస్తానని అనుకోలేదు. నా కుటుంబాన్ని ఈ రోజు నేను రోడ్డుపైకి తీసుకొచ్చాను. అంతా అప్పుల పాలైపోయాను. నన్ను క్షమించండి. ఈ రోజు నేను తల ఎత్తుకొని బతకలేకపోతున్నాను. నా చావుకు కారణం హీరో మాన్యం మురళీ కృష్ణ. ఇతను రైల్వే కాంటాక్ట్‌ పేరుతో నన్ను మోసం చేశాడు. మొత్తం మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇందులో నా బంధువులతో పాటు సోదరులు కూడా డబ్బులు పెట్టారు. మురళీ కృష్ణ వల్ల అందరూ ఇప్పుడు రోడ్డు పైకి వచ్చారు. ఇన్నిరోజుల నా కష్టం మొత్తం వృథా అయిపోయింది. అతన్ని(మురళీ కృష్ణ) మాత్రం వదలకండి. మురళీ కృష్ణతో పాటు వాళ్ల తమ్ముడు కూడా ఇందులో ఉన్నాడు. ఇద్దరు కలిసి మమ్మల్ని మోసం చేశారు. డబ్బులు అడుగుతుంటే ఇవ్వడం లేదు. ఏం చేయాలో తెలియక సూసైడ్‌ చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి’ అని రాసుకొచ్చాడు లోకేశ్.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న వీడియో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us