చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జీవిత కథ ఆధారంగా సినిమా.. హీరోగా ఎవరిని అనుకుంటున్నారంటే..

|

Feb 13, 2021 | 2:17 AM

చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ బయోపిక్ తీసేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వనాథన్ ఆనంద్ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్..

చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జీవిత కథ ఆధారంగా సినిమా.. హీరోగా ఎవరిని అనుకుంటున్నారంటే..
Follow us on

viswanathan anand : చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ బయోపిక్ తీసేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వనాథన్ ఆనంద్ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అన్న సంగతి చాలా మందికి తెలుసు. అంతేకాదు, ఇండియా నుంచి తొలి గ్రాండ్ మాస్టర్ కూడా ఆయనే. 1988లో ఆనంద్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకున్న తొలి క్రీడాకారుడు కూడా విశ్వనాథన్ ఆనందే. 1991-92లో ఆయన ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. భారత రెండో అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను 2007లో ఆనంద్‌కు దక్కింది. విశ్వనాథన్ ఆనంద్ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విశ్వనాథన్ ఆనంద్ పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే చిత్ర నిర్మాత మహావీర్ జైన్ మాట్లాడుతూ.. టైటిల్ రోల్కు అమీర్ ఖాన్ అయితే సెట్ అవుతాడని తన అభిప్రాయమని చెప్పారు. ఇప్పుడీ విషయం హాట్టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా   స్టోరీపై వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Uppena Movie : ‘ఉప్పెన’ సినిమాలో మొదటిగా ఆ హీరోని అనుకున్నారట.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు