Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. పెళ్లైనా చేతి నిండా సినిమాలే.. గుర్తు పట్టారా?

2007లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజిబిజీగా ఉంటోంది. మరీ ముఖ్యంగా పెళ్లైన తర్వాత ఈ అమ్మడికి క్రేజ్ బాగా పెరిగిపోయింది. గతంలోలా గ్లామరస్ రోల్స్ కాకుండా కథా నేపథ్యమున్న చిత్రాలే ఎక్కువగా చేస్తోందీ అందాల తార. అందులోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెద్ద పీట వేస్తోంది.

Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. పెళ్లైనా చేతి నిండా సినిమాలే.. గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us

|

Updated on: Jun 16, 2024 | 9:59 PM

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న అమ్మాయి ఎవరో తెలుసా? రెగ్యులర్ గా సినిమాలు చూసే వారు పోలికలు చూసి ఆమె ఎవరో గుర్తు పట్టవచ్చు. ఈ అమ్మడికి సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థాన ముంది. 2007లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజిబిజీగా ఉంటోంది. మరీ ముఖ్యంగా పెళ్లైన తర్వాత ఈ అమ్మడికి క్రేజ్ బాగా పెరిగిపోయింది. గతంలోలా గ్లామరస్ రోల్స్ కాకుండా కథా నేపథ్యమున్న చిత్రాలే ఎక్కువగా చేస్తోందీ అందాల తార. అందులోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెద్ద పీట వేస్తోంది. ఇటీవలే పోలీసాఫీసర్ గానూ అదరగొట్టింది. ఈ క్యూటీ మరెవరో కాదుఇటీవలే సత్య భామ సినిమాతో మన ముందుకు వచ్చిన చందమామ కాజల్ అగర్వాల్. ఈ ఫొటో తన చిన్నప్పటిది. ఇందులో క్యూట్ స్మైల్ తో ఎందో అందంగా కనిపించింది కాజల్ అగర్వాల్.

ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది మొత్తం 3 సినిమాల్లో నటించింది కాజల్. ఘోస్టీ, కరుంగాపియం (తెలుగులో కార్తీక), భగవంత్ కేసరి వంటి సినిమాల్లో కాజల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ ఏడాది మరింత ఫుల్ జోష్ లో ఉందీ పంచదార బొమ్మ. ఇప్పటికే ఏసీపీ సత్యభామగా ఆడియెన్స్ ను మెప్పించింది. ప్రస్తుతం ఆమె చేతిలో కమల్ హాసన్-శంకర్ ల క్రేజీ ప్రాజెక్టు ఇండియన్ 2 (భారతీయుడు 2) ఉంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలోనూ కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

ఫాదర్స్ డే స్పెషల్.. తండ్రితో కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్..

భర్త, కుమారుడితో సరదాగా కాజల్ అగర్వాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles