
ఇండియన్ సినిమా హిస్టరీలో శ్రీదేవి స్థానం ఎప్పటికీ పదిలం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, తన యాక్టింగ్, గ్లామర్, డ్యాన్స్‌తో సౌత్ ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేశారు శ్రీదేవి. ఇప్పుడు అదే లెగసీని కంటిన్యూ చేయడానికి ఆమె ముద్దుల కూతురు జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీలో కష్టపడుతున్నారు. ఒక స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ, ఇప్పుడు సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో జాన్వీ కపూర్ సౌత్‌లో మరో శ్రీదేవి అవుతారా? అన్న డిస్కషన్ జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో బిగ్ హిట్ అందుకున్నా… ఆ సినిమాలో జాన్వీ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండటంతో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయినా ఉన్నంతలో తంగం పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
పల్లెటూరి అమ్మాయిగా ఆమె లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాటల్లో ఆమె చేసిన డ్యాన్స్, గ్రేస్, గ్లామర్‌కు సౌత్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో కూడా ఉందన్న కామెంట్స్ వినిపించాయి. సౌత్ ఎంట్రీ కోసం ఆమె చేసిన హార్డ్ వర్క్ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపించింది.
దేవర ఇచ్చిన జోష్‌తో జాన్వీ కపూర్ మీద సౌత్ మేకర్స్ ఫోకస్ పెరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన పెద్ది సినిమాలో హీరోయిన్‌గా నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద నెక్ట్స్ లెవల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చాలా కీలకం అంటూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. దేవర తర్వాత మరో స్టార్ స్టార్ హీరో సరసన అవకాశం రావడం, ఆ సినిమా నేషనల్ లెవల్‌లో బజ్ క్రియేట్ చేస్తుండటంతో ఆమె టాప్ హీరోయిన్ రేసులో ముందు వరుసలోకి వచ్చేస్తారంటున్నారు క్రిటిక్స్.
ఒక స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి రావడం ఈజీనే, కానీ సక్సెస్ సాధించి నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందులోనూ శ్రీదేవి లాంటి లెజెండరీ యాక్ట్రెస్ కూతురు అనగానే ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉంటాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ తల్లితో పోలికలు వెతుకుతారు. అయితే జాన్వీ కపూర్ ఈ ప్రెజర్‌ను చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. తనకంటూ ఒక స్పెషల్ స్టైల్ క్రియేట్ చేసుకోవడానికి ఆమె కష్టపడుతున్నారు. యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు, భాష నేర్చుకోవడం మీద ఫోకస్ పెట్టారు.
శ్రీదేవి ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల పాత్రలు చేశారు. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా, పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్లో అలరించారు. జాన్వీ కపూర్ కూడా భవిష్యత్తులో అలాంటి వైవిధ్యమైన కథలు ఎంచుకుంటే, కచ్చితంగా సౌత్ ఆడియన్స్ ఆమెను మరో శ్రీదేవిలా ఆదరించే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతానికి ఆమెను ఓ బాలీవుడ్ బ్యూటీగానే రిసీవ్ చేసుకుంటున్నారు. మరి జాన్వీ ఆ ఇమేజ్‌ను బ్రేక్ చేసి సత్తా చాటుతారేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తలు చదవండి