Tollywood: మద్యం దుకాణాల్లో పనిచేసి, వీధుల్లో పెన్నులు అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తోన్న కామెడీ కింగ్..

సాధారణంగా సినీ రంగుల ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలో అడుగుపెడుతుంటారు. అవమానాలు, విమర్శలను ఎదుర్కొని తమదైన నటనతో గుర్తింపు తెచ్చుకుంటారు. ఇండస్ట్రీలో రాణించాలంటే ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అలాంటి వారిలో జానీ లీవర్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన

Tollywood: మద్యం దుకాణాల్లో పనిచేసి, వీధుల్లో పెన్నులు అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తోన్న కామెడీ కింగ్..
Tollywood
Follow us

|

Updated on: Aug 14, 2024 | 4:56 PM

సాధారణంగా సినీ రంగుల ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలో అడుగుపెడుతుంటారు. అవమానాలు, విమర్శలను ఎదుర్కొని తమదైన నటనతో గుర్తింపు తెచ్చుకుంటారు. ఇండస్ట్రీలో రాణించాలంటే ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అలాంటి వారిలో జానీ లీవర్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జానీ లీవర్.. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. జానీ లీవర్ హాస్య ప్రపంచంలో మకుటం లేని రారాజు. సినిమాల్లో తన కామెడీతో ప్రజలను బాగా నవ్వించాడు. చాలా సార్లు ప్రజలు అతని కామెడీ వీడియోలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఈ కామెడీ కింగ్ ఆగస్టు 14న 67వ ఏట అడుగుపెట్టాడు. తన శక్తివంతమైన కామెడీ ఆధారంగా, అతను గత 4 దశాబ్దాలుగా ప్రజల హృదయాలను శాసిస్తున్నాడు. అయితే 1957వ సంవత్సరంలో ‘హిందూస్థాన్ లివర్’ కుటుంబంలో జన్మించిన జానీ తన జీవితంలో డబ్బు కోసం కొన్నిసార్లు మద్యం దుకాణాల్లో పని చేసేవాడని, కొన్నిసార్లు వీధుల్లో పెన్నులు కూడా అమ్మేవాడని మీకు తెలుసా.

జానీ పేద కుటుంబం నుంచి వచ్చాడు. చదువు కూడా పూర్తి చేయలేనంత దారుణంగా ఇంట్లో పరిస్థితులు నెలకొన్నాయి. 7వ తరగతి వరకే చదివి ఆ తర్వాత ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం, నటించడం అంటే ఇష్టం. 15 ఏళ్ల వయసులో వీధుల్లో పెన్నులు అమ్మడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెన్నులు అమ్మాలనే ఆలోచనను జానీకి అతని స్నేహితులలో ఒకరు అందించారు. 3 నుంచి 4 నెలలపాటు వీధుల్లో పెన్నులు అమ్మారు. అప్పట్లో ఒక రోజు మొత్తం 20-25 రూపాయలు సంపాదించేవాడు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు అతను నటుల గొంతులను అనుకరిస్తూ పెన్నులు అమ్మడం ప్రారంభించాడు. దీంతో అతను రూ.250 నుండి రూ.300 సంపాదించడం ప్రారంభించాడు.

జానీ వీధిలో పెన్నులు అమ్మేవాడిగా మాత్రమే కాకుండా, సినిమా ప్రపంచంలోకి రాకముందు కాంట్రాక్ట్ మీద కూడా పనిచేశాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాను మద్యం దుకాణంలో పనిచేసేవాడినని అదే ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘మేము ఒక మురికివాడలో నివసించాము, కాబట్టి నేను పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, నేను మద్యం బార్‌లో పనిచేసేవాడిని. నాకు ఎంత డబ్బు వచ్చినా ఇంటి ఖర్చులకు ఇచ్చేవాడిని. మా నాన్న అతిగా మద్యం తాగుతుండేవాడు. అందుకే ఇంట్లో పరిస్థితులు దారుణంగా ఉండేవి. ఇంటి రేషన్ కోసం కూడా మామ దగ్గర డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

జానీ లీవర్ అసలు పేరు జాన్ ప్రకాష్ రావు జనుమల. సునీల్ దత్ చిత్రం ‘దర్ద్ కా రిష్తా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు అతడు 300 కి పైగా చిత్రాలలో పనిచేశాడు. ప్రతి పెద్ద స్టార్‌తో సినిమాలు చేశాడు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల ‘కరణ్ అర్జున్’ నుండి ‘బాజీగర్’, ‘ఫిర్ హేరా ఫేరీ’, ‘ఆమ్దానీ అత్తన్ని ఖర్చు రూపయ్య’, ‘ఎంటర్‌టైన్‌మెంట్’, ‘ఖట్టా-మీఠా’, ‘రాజా హిందుస్తానీ’ వంటి ఎన్నో గొప్ప చిత్రాలలో పనిచేశాడు.

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..